tamanaah returns back to south indian industry

Tamanaah to return to south indian films

tamannaah bhatia, tamannaah, tamannaah movies, tamannaah hits, tamannaah gallaries, tamannaah new movies, tamannaah musical hits, tamannaah collections, tamannaah forth comming movies, bollywood, south film industry, baahubali

Actress and popular heroine tamanaah returns back to south indian film industry after her movies floped in bollywood

అక్కడ వుండలేను.. ఇక్కడే వచ్చేస్తానంటున్న మిల్కీ బ్యూటీ..

Posted: 06/21/2015 09:02 PM IST
Tamanaah to return to south indian films

దక్షిణాధి సినీ తారలు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. వారిలో సక్సెస్ అయిన వారు అక్కడే స్థిరపడుతు.. బాలీవుడ్ అంటే అదో కళాకారుల సముద్రంగా అభివర్ణిస్తుంటారు. కాగా, రాణించలేకపోయిన వారు మాత్రం  అమ్మె బాలీవుడా..? అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తారు. వారిలో ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా. తన అదృష్టాన్ని పరీక్షించుకుని కలసిరాకపోవడంతో తిరిగి మళ్లీ దక్షిణాధికి తిరిగి వచ్చిన బామ ఏ ఎండకా గోడుగు పట్టడంలో సిద్దహస్తురాలని నిరూపించుకుంది. అదేంటంటారా..?

గత అనుభావాల నుంచి నేర్చుకున్న పాఠాల నేపథ్యంలో ఇకపై దక్షిణాధిపైనే దృష్టి పెడతానని తమన్నా స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక చిత్రం బహుబలిలో అమె కీలక పాత్ర పోషించింది. వచ్చే నెల 10 ఈ చిత్రం విడుదల కానుండటంతో..ఇక తన భవిష్యత్తును సౌత్ లోనే పథిలపర్చుకోవాలని నిర్ణయించుకుంది. తన చేతిలో వున్న తెలుగు తమిళ చిత్రాలతో సంతోషంగా వున్నానని తెలిపింది. ఇకపై బాలీవుడ్ కు ప్రతాధాన్యత ఇవ్వబోనని స్పష్టం చేసింది. బాహుబలిలో తన పాత్రను కరణ్ జోహర్ ఎంతో మెచ్చుకున్నారని పోంగిపోయింది. బాలీవుడ్ లో తమన్నా నటించిన హిమ్మత్ వాలా, హమ్ షకల్స్, సినిమాలు ప్లావ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది అమ్మడు.

అయితే బాహుబలి చిత్రం హిందీలో రిలీజ్ అయిన తరువాత అమెకు ఆపర్లు వచ్చే అవకాశాలు వున్నా.. మరి కొంచెం ముందుగానే తన నిర్ణయాన్ని చెప్పేసింది బ్యూటీ. ఒక వేళ్ బాహుబలి విడుదల అయిన తరువాత కూడా అమెకు బాలీవుడ్ లో ఆఫర్లు రాకపోతే.. అప్పడు అలోచించడం కన్నా.. కాస్త ముందుగానే తన నిర్ణయాన్ని చెప్పి.. ఒక వేళ ఆపర్లు వస్తే.. అటు, ఇటూ కంటిన్యూ అవ్వాలనే ఇలా చెప్పేసిందని సినీ జనాలు గుసగుసలాడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamannaah bhatia  bollywood  south film industry  baahubali  

Other Articles