Avika Gor Is Doing Another Telugu Flick Named Tanu Nenu | Telugu Movies

Avika gor tanu nenu latest movie updates

avika gor news, avika gor movies, avika gor movie updates, avika gor love affairs, avika gor affairs, avika gor hot photos, avika gor serials, avika gor movie gossips, tanu nenu movies

avika gor tanu nenu latest movie updates : Actress Avika Gor Is Doing Another Telugu Flick Named Tanu Nenu. In This Movie Director Shobhan Kumar Son Is Acting in Leading role and directed by rammohan.

దర్శకుడు కొడుకుని వలలో వేసుకున్న అవికా

Posted: 06/13/2015 03:33 PM IST
Avika gor tanu nenu latest movie updates

ఇండస్ట్రీలో వుండే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, నటీనటుల మధ్య మంచి సంబంధాలే వుంటాయి. కొంతమంది మధ్య స్నేహబంధం వుంటే.. మరికొంతమందిలో అనుకోకుండా ప్రేమ బంధాలు పుట్టుకొచ్చేస్తాయి. ఈ తరహాలోనే ఓ తెలుగు దర్శకుడి తనయుడు నటి అవికా గోర్ ప్రేమ వలలో పడిపోయినట్లు సమాచారం! అనుకోకుండా ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా మారింది. కాలక్రమంలో అది ప్రేమకు దారితీసింది. ఇప్పుడు వారిద్దరు ‘తను-నేను’ అనుకుంటూ కాలం గడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం రియల్ లైఫ్ కి సంబంధించి కాదులెండి.. రీల్ లైఫ్ కి సంబంధించింది.

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటి అవికా గోర్.. ‘ఉయ్యాల జంపాల’ చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రం ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి ‘తను-నేను’ అనే చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం దక్కించుకుంది. ‘గోల్కొండ హై స్కూల్’, ‘ఉయ్యాల జంపాలా’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన పి. రామ్మోహన్.. ఇప్పుడు దర్శకుడిగా అవతారమెత్తి ‘తను-నేను’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో నటించిన దర్శకుడు శోభన్ తనయుడు ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అందుకే.. దర్శకుడు కొడుకుని అవికా వలలో వేసుకున్నట్లుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ని చూస్తే.. ఇది ఒక ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలావరకు పూర్తయ్యిందని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : avika gor  tanu nenu movie  

Other Articles