Allu arjun role in dialoma | boyapati srinu new movie | geetha arts banner | allu arvind

Allu arjun character in boyapati srinu directorial movie

allu arjun news, allu arjun new movie, allu arjun updates, allu arjun latest news, allu arjun gossips, allu arjun photo shoot, boyapati srinu new movie, boyapati srinu news, boyapati movie updates, boyapati srinu updates, allu arjun boyapati movie, geetha arts, allu arvind, boyapati srinu allu arjun movie, allu arjun boyapati srinu movie

allu arjun character in boyapati srinu directorial movie : A confusion going viral in tollywood industry about allu arjun character in boyapati directoral movie.

బన్నీ పాత్రని డైలామాలో పడేసిన బోయపాటి

Posted: 06/13/2015 03:40 PM IST
Allu arjun character in boyapati srinu directorial movie

‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలతో మంచి ఉత్సాహంలో వున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన తదుపరి చిత్రం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. నిజానికి ఈ చిత్రం గతంలోనే ప్రారంభం కావాల్సింది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరికీ అన్ని అడ్డంకులు తొలిగిపోయిన నేపథ్యంలో ఈ చిత్రం ఎట్టకేలకు మొదలైంది. ఇందులో బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అయితే.. ఆ ఇద్దరు తారలు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు.

ఇదిలావుండగా.. దర్శకుడు బోయపాటి శ్రీను తన సినిమాల్లో హీరోలను చాలా పవర్ ఫుల్ గా చూపిస్తాడన్న విషయం తెలిసిందే! చాలావరకు యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించే ఈ దర్శకుడు.. ఆ సీన్లలో హీరోని హైలైట్ గా ప్రెజెంట్ చేస్తాడు. అంతేకాదు.. ఇతను తీసే సినిమాలు చాలా కమర్షియల్ గా వుంటాయి. అందుకు తగ్గట్టుగానే హీరోలను ఆ విధంగా ప్రెజెంట్ చేస్తాడు శ్రీను. అయితే.. స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లు అర్జున్ ని ఈ దర్శకుడు ఏ విధంగా చూపిస్తాడోనన్న విషయం ఆసక్తిగా నెలకొంది. బన్నీని కూడా కమర్షియల్ గానే ప్రెజెంట్ చేస్తాడా..? లేదా..? అతనికున్న స్టైలిష్ మార్క్ కు తగ్గట్టుగానే కొత్తగా చూపిస్తాడా..? అన్న విషయంపై ఇండస్ట్రీలో చర్చలు కొనసాగుతున్నాయి.

మరోవైపు.. ఈ సినిమాలో బన్నీ పాత్ర చిత్రీకరణను బోయపాటి చాలా విభిన్న రీతిలో తెరకేక్కించానున్నట్లు వార్తలొస్తున్నాయి. బన్నీ తో ఇదే తొలి చిత్రం కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదివరకు అతడు తెరకెక్కించే సినిమాల్లో హీరోలను ప్రెజెంట్ చేసిన విధానికి భిన్నంగా ఇందులో బన్నీని చూపించనున్నాడని చెప్పుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు జోడిస్తూనే.. బన్నీని వెరైటీగా ప్రెజెంట్ చేయాలని బోయపాటి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటున్నారు. ఏదేమైనా.. యాక్షన్ ని అద్భుతంగా తెరకెక్కించే బోయపాటి బన్నీని ఎలా ప్రజెంట్ చేస్తాడన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇ ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకుడు. ‘లెజెండ్’ సక్సెస్ తో ఊపుమీదున్న బోయపాటికి.. హ్యాట్ ట్రిక్ కోసం ఎదురుచూస్తున్న బన్నీకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించనుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  boyapati srinu  geetha arts  allu arvind  

Other Articles