allu arjun and boyapati srinu latest movie titled as chilipivaadu | tollywood gossips | telugu heroines

Allu arjun boyapati srinu latest movie title chilipivaadu tollywood gossips

allu arjun, boyapati srinu, son of satyamurthy, allu arvind, geetha arts banner, telugu movies, tollywood movies, telugu movie updates, allu arjun movies, boyapati srinu movies, allu arjun boyapati movie

allu arjun boyapati srinu latest movie title chilipivaadu tollywood gossips : According to filmnagar news Allu arjun and Boyapati srinu latest movie titled as Chilipivaadu. But it is not announced officially.

బన్నీ చాలా ‘చిలిపివాడ’ట!

Posted: 06/12/2015 03:59 PM IST
Allu arjun boyapati srinu latest movie title chilipivaadu tollywood gossips

‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో ప్యామిలీ విజయం అందుకున్న అల్లుఅర్జున్.. తన తదుపరి చిత్రం బోయపాటితో చేయనున్నాడన్న విషయం తెలిసిందే! నిజానికి వీరి కాంబోలో చిత్రం ఇప్పటికే రూపొందుకోవాల్సింది కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరగా అడ్డంకులు తొలగిపోయవడంతో ఈ చిత్రం శుక్రవారం (12-06-2015) లాంఛనంగా ప్రారంభమైంది. ‘గీతా ఆర్ట్స్ బ్యానర్’లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్న ఈ చిత్రానికి ‘చిలిపివాడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్! ఈ చిత్రంలో బన్నీ ఇద్దరు తారలతో రొమాన్స్ చేయడంతోపాటు చిలిపి పనులు చేస్తూ వుంటాడని, అందుకే ఈ మూవీకి ‘చిలిపివాడు’ అనే టైటిల్ పెట్టే దిశగా యూనిట్ బృందం చర్చలు కొనసాగిస్తోందని వార్తలొస్తున్నాయి. మరి.. ఈ వార్తల్లో ఎంత వాస్తవం వుందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే! అంతేకాదు.. ఈ చిత్రంలో బన్నీ సరికొత్త గెప్ లో కనిపించనున్నాడని యూనిట్ బృందం తెలుపుతోంది. ఈ మూవీలో బన్నీ సరసన నటించనున్న ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఆ వివరాలను చిత్రబృందం వెల్లడించనుంది.

ఇకపోతే దర్శకుడు బోయపాటి శ్రీను తాను తెరకెక్కించే సినిమాల్లో కథానాయకుడిని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తాడన్న విషయం తెలిసిందే! ఇప్పుడు తన తదుపరి చిత్రంలో కూడా బన్నీని డైనమిక్ గా చూపించనున్నాడని తెలుస్తోంది. ఫ్యామిలీ-కామెడీ ఎలిమెంట్స్ తోపాటు ఎక్కువ యాక్షన్ మోతాదుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బన్నీ కూడా బాగానే కసరత్తు చేస్తున్నాడని సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles