Sai Dharm Tej to do third movie with producer dil raju which title is Santhanam Bhavathi | tollywood gossips

Sai dahram tej dil raju third movie santhanam bhavathi title

sai dharam tej, dil raju, santhanam bhavathi, dilraju movie updates, dil raju kerintha movie, sai dharam tej movie, sai dharam tej new movie, sai dharam tej subramanyam for sale movie

sai dahram tej dil raju third movie santhanam bhavathi title : According to the filmnagar news Sai dharam and producer dil raju third time to make movie which is titled as santhanam bhavathi.

దిల్ రాజు చేతిలో సాయి ధరమ్ తేజ్ ‘సంతానం’

Posted: 06/12/2015 03:14 PM IST
Sai dahram tej dil raju third movie santhanam bhavathi title

మెగాకుటుంబం నుంచి వచ్చిన యువహీరో సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. నిజానికి ఇతను నటించిన మొదటి సినిమా ‘రేయ్’ అయినప్పటికీ.. ఆర్థిక కారణాల వల్ల దాని విడుదల ఆలస్యం అయింది. దీంతో సాయి ‘పిల్లా..’తో ఎంట్రీ ఇచ్చాడు.. ఫస్ట్ హిట్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదిలావుండగా.. ఈ మూవీ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించబోయే సినిమా గురించి అప్పుడే ప్రచారం మొదలైంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు ప్రకారం.. సాయి ధరమ్ తేజ్ నిర్మాత దిల్‌రాజుతో మరో సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడట! అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని, ఇప్పటికే ఆ మూవీకి ‘సంతానం భవతి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. గతంలో ‘గబ్బర్ సింగ్’, ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే సహకారం అందించిన వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీ షూటంగ్ స్టార్ట్ చేస్తారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ మూవీ నిజమైతే.. దీంతో దిల్ రాజు-సాయి ధరమ్ కాంబో హ్యాట్రిక్ కొట్టినట్లే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej  subramanyam for sale  santhanam bhavathi  producer dil raju  

Other Articles