Nanditha says that when she watch kannada charminar movie she loves the story | krishnamma kalipindi iddarini

Nanditha loves kannad charminar movie story krishnamma kalipindi iddarini

Nanditha loves kannad charminar movie story krishnamma kalipindi iddarini : Nanditha says that when she watch kannada charminar movie she loves the story. This movie remake as krishnamma kalipindi iddarini in telugu.

Nanditha loves kannad charminar movie story krishnamma kalipindi iddarini : Nanditha says that when she watch kannada charminar movie she loves the story. This movie remake as krishnamma kalipindi iddarini in telugu.

‘ప్యార్ మే పడిపోయా మై’ అంటున్న నందిత

Posted: 06/12/2015 10:16 AM IST
Nanditha loves kannad charminar movie story krishnamma kalipindi iddarini

చాలావరకు హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసేందుకు అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా తాము అమితంగా ప్రేమించే వ్యవహారాలను వెల్లడించేందుకు అస్సలు ముందుకు రారు. వాటిగురించి ప్రశ్నించినా.. కోపంగా బుంగిమూతి పెడుతూ తప్పుకుంటారే తప్ప ఏమీ మాట్లాడరు. కేవలం కొద్దిమంది తారలు మాత్రమే అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలను తెలుపుతారు. అందులో భాగంగానే తాజాగా నందిత ఓ సందర్భంలో ‘ప్యార్ మై పడిపోయా మై’ అంటూ ఝలకిచ్చింది. అయితే.. తాను ప్రేమిస్తోంది ఏ హీరోనో, వ్యాపారవేత్తనో కాదులెండి.. ఓ సినిమా కథతో! కన్నడంలో రూపొందిన ‘చార్మినార్’ చిత్రం కథతో తాను ప్రేమలో పడిపోయినట్లుగా అమ్మడు తెలిపింది.

సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్. చంద్రు దర్శకత్వంలో శ్రీమతి లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. కన్నడంలో రూపొందిన ‘చార్మినార్’ చిత్రానికి ఇది రీమేక్! ఈ చిత్రాన్ని ఈనెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రం యూనిట్ తోపాటు హీరోహీరోయిన్లు బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో విలేకరులతో మాట్లాడిన అమ్మడు.. తాను కన్నడలో ఈ చిత్రాన్ని చూసి ఆ కథతో ప్రేమలో పడిపోయినట్లుగా తెలిపింది. ఏమాత్రం అశ్లీలతో లేకుండా కొనసాగే ఈ ప్రేమకథాచిత్రం అందరినీ మెప్పిస్తుందని ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తపరిచింది.

ఈ సందర్భంగానే నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘కన్నడంలో రూపొందిన ‘చార్మినార్’ చిత్రం చూడగానే, ఆ కథతో నాకు ఎంతో బాగా నచ్చింది. అందుకే తెలుగు పునర్నిర్మాణ హక్కులు పొందాను. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రూతోనే తెలుగు రీమేక్ రూపొందించాను. అసభ్యతకు తావు లేని చిత్రం ఇది. సుధీర్‌బాబు, నందితల నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఈ 19న విడుదల చేసే ఈ చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. మరి.. ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని ఎలా మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nanditha  sudheer babu  kannada charminar  krishnamma kalipindi iddarini  

Other Articles