telugu hero aadi director veerabhadram latest project starts | tollywood | telugu news

Telugu hero aadi director veerabhadram latest project starts

telugu hero aadi news, aadi new movie news, aadi movie updates, aadi new movie launch, aadi movie gallery, aadi movie news, director veerabhadram

telugu hero aadi director veerabhadram latest project starts : After rough disaster telugu hero aadi started his new project with director veerabhadram.

రెండేళ్ల తర్వాత ‘చుట్టాలబ్బాయి’తో ఆ డైరెక్టర్?

Posted: 06/11/2015 06:51 PM IST
Telugu hero aadi director veerabhadram latest project starts

సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నాడు. ‘ప్రేమకావాలి’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆది.. ఆ తర్వాత ‘లవ్ లీ’ చిత్రంతో మంచి విజయాన్నే అందుకున్నాడు. యువహీరోల్లో మంచి ఫాలోయింగ్ నే సంపాదించుకోగలిగాడు. ప్రస్తుతం ‘గరం’ చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్న ఈ నటుడు.. అప్పుడే మరో చిత్రం మొదలుపెట్టేశాడు. ఈసారి ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కోసం ఈ యువహీరో ‘చుట్టాలబ్బాయి’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

‘అహ నా పెళ్లంట’, ’పూలరంగుడు’, ‘భాయ్’ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు వీరభద్రంతో దర్శకత్వంలో ఆది ‘చుట్టాలబ్బాయి’ సినిమాలో నటిస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మి ఫిలింస్ పతాకంపై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ మూవీలో ఇంకా హీరోయిన్ ఎవరనే విషయాన్ని యూనిట్ బృందం ప్రకటించలేదు. ఈ చిత్రం కథ చాలా భిన్నంగానూ, సరికొత్తగానూ వుంటుందని యూనిట్ తెలుపుతోంది.

ఇక ‘భాయ్’తో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న దర్శకుడు వీరభద్రం.. ఈ చుట్టాలబ్బాయి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఈ ‘చుట్టాలబ్బాయి’ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu hero aadi  director veerabhadram  sai kumar  

Other Articles