Sudeep Ranna movie collections report

Sudeep ranna movie collections report

Ranna movie latest news, Ranna movie updates, Ranna movie trailer, Ranna movie songs, Ranna movie videos, Ranna movie collections, Ranna movie records, Ranna movie stills, Ranna movie posters, Ranna movie gallery, Ranna

Sudeep Ranna movie collections report: Sudeep latest blockbuster film Ranna. Starring Kichcha Sudeep, Rachita Ram & Haripriya. Music composer V Harikrishna has scored music for the movie.

కన్నడ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న రన్న

Posted: 06/10/2015 12:39 PM IST
Sudeep ranna movie collections report

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. సినిమా విడుదలకు ముందే సినిమా మొత్తం పైరసీ అయ్యినా కూడా.. ఎలాంటి ఆందోళన చెందకుండా సినిమాను విడుదల చేసారు చిత్ర యూనిట్. సినిమా విడుదలయ్యాక అన్ని రికార్డులను బ్రేక్ చేసే విధంగా భారీ కలెక్షన్ల వర్షం కురిపించింది.

పవర్ స్టార్ స్టామినాను భారీగా పెంచేసింది. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ పాడిన పాట యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు. అయితే ఈ చిత్రాన్ని కన్నడంలో ‘రన్న’ పేరుతో రీమేక్ చేసారు.

కన్నడ స్టార్ హీరో సుదీప్ హీరోగా ‘రన్న’ పేరుతో ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని రీమేక్ చేసారు. ఈ చిత్రం కన్నడలో కూడా దుమ్ముదులుపుతోంది. ‘రన్న’ చిత్రం ఇటీవలే జూన్ 4న విడుదలయ్యింది. విడుదలైన రోజు నుంచి ‘రన్న’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజే దాదాపు 3.6 కోట్లు వసూలు చేసి, మూడు రోజుల్లోనే 10 కోట్ల మార్కు దాటేసింది. త్వరలోనే కన్నడ సినీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమంటున్నాయి కన్నడ సినీవర్గాలు.

నందకిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుదీప్ సరసన రచితారామ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ట్రైలర్ మరియు పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా విడుదలయ్యాక ‘రన్న’కు భారీ ప్రశంసలు దక్కాయి. సుదీప్ ఇప్పటికే తెలుగులో విజయం సాధించిన పలు చిత్రాలను కన్నడంలో రీమేక్ చేసారు. ఈ ‘అత్తారింటికి దారేది’ చిత్రాన్ని కూడా ‘రన్న’ పేరుతో రీమేక్ చేసి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ‘రన్న’ ఇంకెంత రికార్డులు సృష్టించనుందో చూడాలి.

Video Courtesy: DBeatsMusicWorld

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranna movie  Sudeep  Collections report  Trailer  

Other Articles