Celina Jaitly Angry on Sunny Leone Couples

Celina jaitly angry on sunny leone couples

Celina Jaitly Angry on Sunny Leone, Celina Jaitly Angry on Sunny Leone Couples, Celina Jaitly Angry, Celina Jaitly comments on Sunny Leone Couples, Celina Jaitly Angry hot comments Leone, Celina Jaitly latest news, Celina Jaitly hot news, Sunny Leone hot news, Sunny Leone latest news, Sunny Leone

Celina Jaitly Angry on Sunny Leone Couples: Bollywood Hot actress Celina Jaitly Angry on porn star Sunny Leone and sunny`s huband denial veber.

అబ్బా... సన్నీ మొత్తం కంపు కంపు చేసిందట

Posted: 06/10/2015 05:07 PM IST
Celina jaitly angry on sunny leone couples

ప్రముఖ పోర్న్ స్టార్, బాలీవుడ్ సెక్సీ భామ సన్నీలియోన్ మొగుడు బాగానే అబద్ధాలు చెప్పినట్లుగా అనిపిస్తోంది కదూ! అరే.. పోనిలే పాపం అని ఇళ్లు ఇస్తే... మొత్తం పెంట పెంట చేసేసారట. సన్నీలియోన్ మరియు ఆమె భర్త డేనియల్ వెబర్ లు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీకి చెందిన ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు వుంటున్నారు. అయితే ఈ మధ్య సన్నీ ఇంటిని పరిశీలించిన సెలినా ఒక్కసారిగా ఖంగుతిందట. ఇళ్లంతా చెత్తాచెదారంతో నింపేసి, అన్ని వస్తువులు ఎలా పడితే అలా పాడేసి వున్నాయని, ఫర్నిచర్ కూడా పాడుచేసారనే వుద్దేశ్యంతో సెలీనా ఆగ్రహంతో సన్నీని ఇళ్లు ఖాళీ చేయాలని కోరిందని గతకొద్ది రోజులుగా వార్తలొచ్చాయి.

కానీ ఈ విషయంపై సన్నీ భర్త వెబర్ మాత్రం మరొక కథనాన్ని చెప్పుకొచ్చాడు. తాము కనీసం ఏడాదైనా సెలీనా అపార్ట్ మెంట్ లో వుండలేదని, జుహూలోని ఓ ఇంట్లో వున్నామని తెలిపాడు. ప్రస్తుతం సన్నీ, తాను వేర్వేరు సినీ, టీవి ప్రాజెక్టులతో బిజీగా వున్నామని, అందువల్ల ఓ హోటల్లో గడుపుతున్నామని చెప్పాడు. అసలు సన్నీ ముంబై బయట ప్రాంతంలోనే ఎక్కువగా వుంటుందని, కాబట్టి ఈ పుకార్లను నమ్మవద్దంటూ వెబర్ చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయంపై సెలీనా తాజా తన ఆవేదనను వ్యక్తం చేసింది. ముంబైలోని తన అద్దె ఇంటిని సన్నీ వాళ్లు వదిలివెళ్లేముందు చాలా చెండాలం చేసేసారని సెలినా భాధపడుతోంది. ఇంట్లోని ఫర్నిచర్, గోడలు మొత్తం ధ్వంసం చేసారని, పైగా బాత్రూముల్లో నెలల తరబడి ఫ్లష్ చేయకుండా వదిలేసి కంపు కంపు చేసేసారని, అంతే కాకుండా ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాంటి వస్తువులను కూడా డామేజ్ చేసారంటూ సెలీనా బోరుమంటోంది. పైగా ఈ విషయంపై వారిని నిలదీసినందుకు డేనియల్ తనను బెదిరించాడంటూ సెలీనా తన బాధను వెల్లగక్కింది. మరి ఈ విషయంపై సన్నీ దంపతులు ఎలాంటి కథనం చెబుతారో చూడాలి.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Celina Jaitly  Sunny Leone  Angry  Bollywood news  

Other Articles