Finally official statement released about rajinikanth next project with director ranjith | Kalaipuli thanu producer

Rajinikanth latest project director ranjith producer kalaipuli thanu officially confirmed

rajinikanth, rajnikanth, rajnikant, rajinikanth new project, young director ranjith, ranjith latest news, rajinikanth movie updates, rajinikanth gossips, rajinikanth gallery, rajinikanth controversies, rajinikanth linga, producer kalaipuli thanu

rajinikanth latest project director ranjith producer kalaipuli thanu officially confirmed : Finally official statement released about rajinikanth next project with young director ranjith and kalaipuli thanu will produce this movie with high budget.

ఎట్టకేలకు రజినీ చిత్రంపై ఓ క్లారిటీ వచ్చింది!

Posted: 06/02/2015 12:34 PM IST
Rajinikanth latest project director ranjith producer kalaipuli thanu officially confirmed

‘కొచ్చాడయాన్’, ‘లింగా’ వంటి భారీ సినిమాలు ఫ్లాప్ అవడంతో రజనీ కొన్నాళ్లు ఆందోళనల్లో మునిగిపోయారు. ముఖ్యంగా ‘లింగా’ వ్యవహారం తమిళనాడులో పెద్ద దుమారాన్నే రేపింది. ఆ మూవీని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటీర్లు పూర్తిగా మునిగిపోయామని, అందుకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనని రచ్చరచ్చ చేశారు. దీంతో రజనీకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. చివరికి ఆ సమస్య ఒక కొలిక్కి వచ్చింది కానీ.. రజనీ మాత్రం తన తదుపరి చిత్రం విషయమై తీవ్ర ఆలోచనల్లో మునిగిపోయారు. తన కెరీర్ లో ఎదురైన ఈ పరాభవాన్ని చెరిపేసుకోవాలంటే తనకు సక్సెస్ అందించే దర్శకుడి కోసం వెయిట్ చేశారు.

ఈ క్రమంలోనే యువ దర్శకుడు రంజిత్ పేరు తెరమీదికొచ్చింది. వైవిధ్యభరితమైన రెండు చిత్రాలను తెరకెక్కించి అనూహ్య విజయాలను సొంతం చేసుకున్న ఈ దర్శకుడు.. రజనీ కోసం కొత్త కథ తయారు చేసుకున్నట్లు ఆమధ్య వార్తలొచ్చాయి. ఆ కథను రజనీకి వినిపించగా.. అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు.. దర్శకుడు శంకర్, రజనీ కోసం ‘రోబో-2’ చిత్ర కథను సిద్ధం చేస్తున్నారన్న వార్తలు వ్యాపించాయి. దీంతో.. రజనీ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారోనని ఇన్నాళ్ళూ కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే.. ఇప్పుడు రజనీ తదుపరి చిత్రంపై ఓ క్లారిటీ వచ్చేసింది. రజనీ ఎవరి దర్శకత్వంలో నటించనున్నారన్న విషయంపై అధికారిక ప్రకటన వెలువడింది.

మొదట్లో అనుకున్నట్లుగానే యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో రజనీ సినిమా చేయనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. కలైపులి థాను నిర్మించే ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు నుంచి రెగ్యులర్ గా నిర్వహించనున్నారు. కథను బట్టి ఈ సినిమా ఎక్కువ భాగం మలేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్ లలో చేస్తారు. కొంత భాగం చెన్నైలోనూ నిర్వహించునున్నట్లు తెలిసింది. అయితే.. ఇందులో రజనీ సరసన నటించే హీరోయిన్ల పేర్లను ఇంకా వెల్లడించలేదు. ఏదైతేనేం.. మొత్తానికి రజనీ మూవీకి ఓ క్లారిటీ వచ్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  director ranjith  kalaipuli thanu  

Other Articles