rudramadevi movie unit has not given clarity on release date | anushka shetty | gunasekhar | tollywood

Rudramadevi financial problems release date clarification anushka shetty gunasekhar

rudramadevi movie, anushka shetty, director guna sekhar, rana daggubati, prakash raj, allu arjun, rudramadevi release date, rudramadevi movie review, rudramadevi movie updates, anushka shetty movies, bahubali, baahubali movie, allu arjun movies, prakash raj movies

rudramadevi financial problems release date clarification anushka shetty gunasekhar : Rudramadevi movie unit has not given clarity on release date. They are planning to release this movie in june or july month before bahubali movie.

ఏం ‘దేవీ’.. ఇంకా ‘మోక్షం’ లభించలేదా?

Posted: 06/02/2015 11:27 AM IST
Rudramadevi financial problems release date clarification anushka shetty gunasekhar

దర్శకనిర్మాత గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘రుద్రమదేవీ’ చిత్రం విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని యూనిట్ బృందం భావించింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. అనుకోకుండా ఒక్కసారిగా ఫైనాన్షియల్ సమస్యలు ఎదురవడంతో ఈ చిత్రం విడుదల అర్థంతరంగా ఆగిపోయింది. దీంతో ఈ చిత్రం విడుదలపై యూనిట్ బృందం గతంలో క్లారిటీ ఇవ్వలేకపోయింది.

అయితే.. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రాన్ని జులైలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ‘రుద్రమదేవి’ని అంతకంటే ముందు దింపాలని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే.. 70 కోట్లకంటే ఎక్కువ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రాన్ని సోలోగా విడుదల చేస్తే.. భారీ కలెక్షన్లను రాబట్టవచ్చునన్న ఉద్దేశంతో ‘బాహుబలి’ కంటే ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆర్థికపరమైన ఇబ్బందులు తీవ్రంగా వుండటంతో ఈ చిత్రం జూన్ లేదా జూలైలో విడుదల అయ్యే అవకాశం కనిపించడం లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనుష్క ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, నిత్యామీనన్ లు ప్రత్యేక పాత్రల్లో కనువిందు చేయనున్నారు.

ఇదిలావుండగా.. చాలాకాలం నుంచి సక్సెస్ లేక సతమతమవుతున్న దర్శకనిర్మాత గుణశేఖర్.. తన మీదున్న ‘ఫెయిల్యూర్’ మార్క్ ను తుడిపేసుకునేందుకు ‘రుద్రమదేవీ’ చిత్రాన్ని ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఈ చిత్రంతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఎంతగానో ఆశిస్తున్నాడు. అయితే.. ఇంతలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురకావడంతో అతడు నిరాశగా వున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎన్ని సమస్యలొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తానని ఆయన అభిప్రాయం వెల్లడించినట్లుగా సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరి.. ‘రుద్రమదేవీ’కి మోక్షం ఎప్పుడు లభిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rudramadevi movie  baahubali  anushka shetty  

Other Articles