Inaa Ishtam Nuvvu Movie Title Launch

Inaa ishtam nuvvu movie title launch

Inaa Ishtam Nuvvu Movie Title Logo Launch, Inaa Ishtam Nuvvu Movie Logo Launch, Inaa Ishtam Nuvvu Movie Title Launch, Inaa Ishtam Nuvvu trailer, Inaa Ishtam Nuvvu movie stills, Inaa Ishtam Nuvvu news, Inaa Ishtam Nuvvu movie updates, Inaa Ishtam Nuvvu

Inaa Ishtam Nuvvu Movie Title Launch: Senior actor Naresh son introduce as hero with his first movie Inaa Ishtam Nuvvu. This Movie Title Logo Launched today.

ఐనా ఇష్టం నువ్వు టైటిల్ లోగో విడుదల

Posted: 05/20/2015 03:45 PM IST
Inaa ishtam nuvvu movie title launch

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రాంప్రసాద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ చిత్రానికి ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ టైటిల్ లోగో, టీజర్ ను తాజాగా సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలలు విడుదల చేసారు. ఈ సంధర్భంగా కృష్ణ మాట్లాడుతూ.... తమ ఫ్యామిలీ నుండి వస్తున్న నవీన్ విజయ్ కృష్ణను కూడా అభిమానులు ఆదరించాలని, నిర్మాతకు పదిరెట్లు ఆదాయం రావాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు.

విజయనిర్మల మాట్లాడుతూ.... పాటలు బాగా వచ్చాయి. కథ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. నరేష్ మాట్లాడుతూ... ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన పాటలు త్వరలోనే విడుదల చేయనున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.

దర్శకుడు రాంప్రసాద్ మాట్లాడుతూ.... చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ.. కథకు సరిపడే టైటిల్ కోసం ఎదురుచూసాం. చివరకు కృష్ణవంశీ గారి సినిమాలోని ఓ పాటను టైటిల్ గా పెట్టాం. ఇందుకోసం ఆయన అనుమతి కూడా తీసుకున్నామని అన్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ చిత్రంలో నాగబాబు, పోసాని కృష్ణమురళి, సప్తగిరి తదితరులు నటించారు.

Video Source: idlebrainlive

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Inaa Ishtam Nuvvu  Title logo  trailer  stills  

Other Articles