Ram charan | Chiranjeevi | interviews | Auto johnny

Ram charan talks about auto johnny movie

Ram charan Talks about Chiranjeevi 150 Movie, Ram charan interview, Ram charan latest news, Ram charan movie news, Ram charan movie updates, Ram charan latest stills, Ram charan latest details, Ram charan stills, Ram charan

Ram charan Talks about Auto johnny Movie: Ramcharan becoming producer with his father chiranjeevi 150th film Auto johnny. Puri jagannadh direction.

చెర్రీ చెప్పిన ఆటోజానీ తాజా వివరాలు

Posted: 05/14/2015 11:55 AM IST
Ram charan talks about auto johnny movie

తాను ఇంకా చిన్నపిల్లాడినే అంటున్న సినీ నటుడు రాంచరణ్ తేజ. చరణ్ ఇటీవలే ఓ డెవిల్ సర్క్యూట్ అనే ఫిట్ నెస్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్ కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో చరణ్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. చరణ్, ఉపాసనల వివాహం ఇటీవలే జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడున్న మీడియా వారు ‘పిల్లల గురించి ఏమైనా ఆలోచించారా’ అని అడగడంతో... వెంటనే చరణ్ స్పందిస్తూ... తనని తానే ఇంకా చిన్న పిల్లాడిలా భావిస్తుంటానని, అలాంటిది నాకు అప్పుడే పిల్లలు ఏంటి? అంటూ చమత్కరించాడు. అయితే ఇంకా ప్లాన్ చేసుకోలేదని, దాని గురించి ఆలోచించాలని చరణ్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

చిరంజీవి 150వ సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.... చిరంజీవి సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుందని, ప్రస్తుతానికి కథ, దర్శకుడిని మాత్రమే ఖరారు చేసామని... మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి తన తండ్రి చిరంజీవితో చర్చిస్తున్నానని తెలిపాడు.

తన తండ్రి 150వ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా, ఉన్నత విలువలతో నిర్మిస్తానని, నిర్మాతగా తన తొలి సినిమాకు భారీ బాధ్యతలు నెలకొన్నాయని, వాటన్నింటిని సమగ్రవంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న తనకు సినీరంగం మొత్తం మద్ధతుపలుకుతోందని చరణ్ చెప్పుకొచ్చాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Chiranjeevi  interviews  Auto johnny  

Other Articles