sonal chauhan replaced vanya mishra in kalyam rams sher movie

Sonal chauhan kalyam ram sher movie vanya mishra replaced gossips

sonal chauhan news, sonal chauhan hot photos, sonal chauhan hot photo shoot, sonal chauhan gallery, sonal chauhan bikini, vanya mishra, vanya mishra hot photo shoot, vanya mishra stills, kalyan ram, kalyan ram news, sher movie updates

sonal chauhan kalyam ram sher movie vanya mishra replaced gossips : According to the sources after some shooting part of sher movie the actress replaced. Vanya mishra removed from this project and soon sonal chauhan join.

బాబాయ్ బ్యూటీతో అబ్బాయి రొమాన్స్

Posted: 04/22/2015 07:18 PM IST
Sonal chauhan kalyam ram sher movie vanya mishra replaced gossips

‘లెజెండ్’ సినిమాలో బాలయ్య సరసన నటించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్ తో ఇప్పుడు అబ్బాయి రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత ‘పటాస్’ సినిమాతో భారీ విజయం అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్... ఆ సినిమా ఇచ్చిన నూతన ఉత్సాహంతో ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘షేర్’ చిత్రీకరణలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే 40 శాతం మేర కంప్లీట్ అయినట్లు సమాచారం! అయితే.. ఇంత షూటింగ్ జరిగిన అనంతరం ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా కథానాయికను మార్చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీగా ‘వన్య మిశ్ర’ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఆమె తన పాత్రమేరకు కొంతభాగం షూటింగ్ కూడా జరుపుకుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే.. ఇంతలోనే ఏమయ్యిందో తెలీదు కానీ.. లేటెస్ట్ న్యూస్ ప్రకారం వన్య మిశ్ర ప్లేస్ లో ‘లెజెండ్’ బ్యూటీ సోనాల్ చౌహాన్ ని రీ-ప్లేస్ చేసారని సమాచారం. అయితే.. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చాలా వరకూ షూటింగ్ అయిన తర్వాత ఇంత సడన్ గా హీరోయిన్ ని ఎందుకు మార్చారా.? అనే అనుమానం అందరిలో మొదలైంది. బహుశా వన్య ఇతర సినిమా షూటింగులతో బిజీగా వుండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి నిష్ర్కమించి వుండవచ్చునని అనుకుంటున్నారు.

vanya-kalyan-updates

ఇదిలావుండగా.. సోనాల్ చౌహాన్ ను ఈ సినిమాలో తీసుకోవడంపై మరోవిధంగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ అమ్మడిని సినిమాలో రెండో హీరోయిన్ గా ఎంపిక చేసి వుంటారని, వన్యమిశ్ర పాత్ర కూడా ఇందులో వుండవచ్చునని చెప్పుకుంటున్నారు. మరి ఈ విషయానికి సరైన సమాధానం తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే! ఇక ఈ సినిమా ఓ డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కుతోందని.. కల్యాణ్ రామ్ లోని నటుడిని కొత్తకోణంలో ఆవిష్కరించే విధంగా సినిమాను ఆవిష్కరిస్తున్నారని చిత్ర టీం అంటోంది. కొమర వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మల్లికార్జున్ డైరెక్టర్!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonal chauhan  vanya mishra  kalyan ram  sher movie udpates  

Other Articles