trivikram srinivas speech on pawan kalyan | son of satyamurthy audio success meet

Trivikram srinivas speech on pawan kalyan son of satyamurthy audio success meet

trivikram srinivas news, trivikram srinivas speech, trivikram srinivas father speech, trivikram srinivas movies, trivikram srinivas controversy, pawan kalyan news, pawan kalyan controversies, pawan kalyan janasena, janasena party news, son of satyamurthy news, son of satyamurthy audio success meet, son of satyamurthy movie photos, son of satyamurthy movie updates

trivikram srinivas speech on pawan kalyan son of satyamurthy audio success meet : Tollywood ace director trivikram srinivas given excellent speech on pawan kalyan in son of satyamurthy audio success meet which is held in vijayawada.

పవన్ కల్యాణ్ పై మాటల మాంత్రికుడి మాయాజాలం

Posted: 04/07/2015 07:55 PM IST
Trivikram srinivas speech on pawan kalyan son of satyamurthy audio success meet

విజయవాడ సమీపంలోని హాయ్ ల్యాండ్ లో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియో సక్సెస్ మీట్ ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే! ఈ వేడుక సందర్భంగా మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్.. తన మాయాజాలాన్ని పవన్ కల్యాణ్ పై ప్రదర్శించాడు. పవన్ కు, తనకు మధ్యగల సాన్నిహిత్యం గురించి వివరించిన ఆయన.. పవన్ కు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులకు తెలియపరిచాడు.

ఈ నేపథ్యంలోనే పవన్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. 'నాయకుడనేవాడు జనంతో పాటు నడవకూడదు, జనం కంటే నాలుగడుగులు ముందుండాలని' దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్న మాటలను గుర్తు చేసిన ఆయన.. పవన్ ను చూసిన ప్రతిసారీ అదే అనిపిస్తుందని పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ ఒక జాతిని శాసిస్తాడని అతని తల్లిదండ్రులతోపాటు అతనిని ఈ స్థాయికి తీసుకొచ్చిన చిరంజీవి కూడా ఎప్పుడూ ఊహించి ఉండరని త్రివిక్రమ్ అన్నారు. పవన్ గురించి ఈ విధంగా త్రివిక్రమ్ చెప్పడంతో ఆ ఫంక్షన్ కు హాజరైన మెగాభిమానులు ఒక్కసారిగా విజిల్స్, చప్పట్లతో హోరెత్తించారు. పవన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సమయంలోనే పవన్ అభిమానులు తనను ఇబ్బంది పెడుతున్నారన్న విషయాన్ని త్రివిక్రమ్ నిర్మొహమాటంగా చెప్పారు. ‘పవన్ కళ్యాణ్ నాకు ఇష్ట స్నేహితుడు.. అయితే అభిమానుల కారణంగా ఆయన నాకు ఇబ్బంది పెట్టే స్నేహితుడిగా మారార’ని వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. నేను ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ ఆయన గురించి అడుగుతారు. ఆయనేమో టీవీ చూడరు. కాబట్టి.. మీరు చూపిస్తున్న అభిమానాన్ని నేను ఆయనకు వివరిస్తూ ఉంటాను అన్నారు. మొత్తానికి త్రివిక్రమ్ వ్యాఖ్యలతో అభిమానులు మరింత హ్యాపీ ఫీలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : son of satyamurthy updates  trivikram srinivas father speech  pawan kalyan  

Other Articles