trivikram srinivas father speech | son of satyamurthy audio success meet

Trivikram srinivas speech on father son of satyamurthy audio success meet

trivikram srinivas news, trivikram srinivas speech, trivikram srinivas father speech, trivikram srinivas movies, trivikram srinivas controversy, son of satyamurthy news, son of satyamurthy audio success meet, son of satyamurthy movie photos, son of satyamurthy movie updates

trivikram srinivas speech on father son of satyamurthy audio success meet : Tollywood ace director trivikram srinivas given excellent speech on father in son of satyamurthy audio success meet which is held in vijayawada.

హ్యాట్సాఫ్ త్రివిక్రమ్.. ‘నాన్న’ డెఫినేషన్ అద్భుతం!

Posted: 04/07/2015 07:03 PM IST
Trivikram srinivas speech on father son of satyamurthy audio success meet

ఏ విధంగా అయితే అమ్మ తన పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుందో.. అదేవిధంగా నాన్న నడక నేర్పించడం నుంచి నీడలా వారి వెనుకే వుంటూ జీవిత పాఠాలు నేర్పిస్తాడు. కానీ.. అమ్మ ప్రేమను ఎంత త్వరగా పసిగడతామో, నాన్న ప్రేమను తెలుసుకోవడంలో అంతే ఆలస్యం చేస్తాం! ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దర్శకుడు త్రివిక్రమ్ నాన్న గురించి చెప్పిన స్పీచ్ ఎంతో అద్భుతం! సినిమాల్లో పంచ్ డైలాగులతో మాయ చేసే త్రివిక్రమ్.. నాన్న గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించి అందరి మనసులను దోచుకున్నాడు. జీవితంలో నాన్న ప్రాముఖ్యత ఏంటో..? ఆయన గొప్పతనం ఎంతో..? అన్న విషయాలను ఆయన విశ్లేషించారు.

'S/O సత్యమూర్తి' ఆడియో సక్సెస్ మీట్ విజయవాడ సమీపంలోని హాయ్ ల్యాండ్ లో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాన్న గురించి చెప్పిన మాటలు ప్రతిఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..

‘'S/O సత్యమూర్తి'.. సత్యమూర్తి కొడుకు విరాజ్ ఆనంద్ కథ. సాధారణంగా అందరూ అమ్మ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం.. కానీ మనం నడిచేది నాన్న బాటలోనే. ఆరేళ్ల వయసులో నాన్నే అందరికీ సూపర్ హీరో! అదే పదేళ్లు వచ్చేసరికి నాన్న కంటే చాలా మంది గొప్పవాళ్లున్నారని భావిస్తాం. పదిహేనేళ్లు వచ్చేసరికి నాన్నకి చాదస్తమని భావించి.. ఆయన మాటలను పట్టించుకోం. ఆయన చెప్పే సత్యాలను, సలహాలను, జీవిత గమ్యానికి సంబంధించిన సూత్రాలను ఏమాత్రం వినిపించుకోం. కానీ.. పెళ్లైన తర్వాత నాన్న చాలా మంచి వాడని అని అనిపిస్తుంది. అదే నలభై ఏళ్లు వచ్చే సరికి నాన్న గొప్పవాడుగా కనబడతాడు. అయితే.. ఆ గొప్పతనాన్ని అంగీకరించేలోపే చాలా మందికి నాన్నలు ఉండరు. నాన్న ఉండగానే ఆయనకు థాంక్స్ చెబుదాం’ అని ఆయన అన్న మాటలు అందరినీ ఒక్కసారిగా కరిగించేశాయి.

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నాన్నలకు ఓర్పు ఎక్కువ. మన కావ్యాల్లో కానీ, నాటకాల్లో కానీ వారి పాత్రకు పెద్ద గుర్తింపు దొరకలేదు. నాన్న నుండి డబ్బు మాత్రమే కాకుండా పేరు, వారసత్వాన్ని తీసుకుని ముందుకు వెళతాం. నాన్న దగ్గర ఇన్ని తీసుకున్నపుడు ఆయనకు ఏమివ్వగలం. ఏమీ ఇవ్వలేం.. ఆయన్ని గుర్తు పెట్టుకుంటే చాలు. నాన్న వేలు పెట్టుకుని నడక నేర్చుకుంటాం. ఆయన భుజాలపై కూర్చొని ప్రపంచాన్ని చూస్తాం. ఆయన ఒళ్లో కూర్చొని చదవడం నేర్చుకుంటాం. ప్రపంచాన్ని చూస్తాం. ఆయన వెళ్లి పోయిన తర్వాత మనం ఒంటరి అయిపోయామని అనుకుంటాం. కానీ నాన్న నీడలా మన వెనకే ఉంటాడు. ఈ సినిమాలో ఇదే చెబుదామనేది నా ఉద్దేశ్యం' అని త్రివిక్రమ్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ ప్రసంగాన్ని విన్న సభీకులు కంటితడి పెట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : son of satyamurthy updates  trivikram srinivas father speech  pawan kalyan  

Other Articles