Mahesh babu srimanthudu shooting updates

Mahesh Babu Srimanthudu Shooting in RFC, Mahesh Babu Srimanthudu movie news, koratala shiva Srimanthudu Movie news, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie shooting, Srimanthudu Movie details, Srimanthudu Movie heroine, Srimanthudu Movie stills, Mahesh Srimanthudu

Mahesh Babu Srimanthudu Shooting Updates: Mahesh Babu latest movie shooting in rfc. Directior koratala shiva. working title Srimanthudu.

యాక్షన్ లో దుమ్ముధులిపేస్తున్న శ్రీమంతుడు

Posted: 03/24/2015 10:33 AM IST
Mahesh babu srimanthudu shooting updates

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా మహేష్ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. అనల్ అరసు నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.

ఇందులో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తవ్వకముందే రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. జులై 17న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘క్లాసిక్స్ ఎంటర్ టైన్ మెంట్’ సంస్థ భారీ రేటుకు ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకుంది.

జగపతిబాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, కమెడియన్ ఆలీ, వెన్నెల కిషోర్, తులసి, సితార తదితరులు నటిస్తున్నారు. ఇక ‘ఆగడు’ చిత్రంతో డిజాస్టర్ చవిచూసిన మహేష్ అభిమానులు మాత్రం ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  koratala shiva  Srimanthudu  shooting  

Other Articles