Distributors thanks to rajinikanth

distributors thanks to rajinikanth, Linga movie distributors, super star rajani kanth, Linga movie distributors thanks to rajinikanth, linga movie crisis, Linga movie settlement, rajani kanth, rajani kanth movies, rajani kanth movie collections, rajinikanth latest updates, rajinikanth new updates, rajinikanth latest news, rajinikanth songs, rajinikanth new stills, rajinikanth new movies, rajinikanth upcomming movies, rajinikanth latest movies

Linga movie distributors thanks to rajinikanth on settlement

పరిహారం చెల్లింపుతో అభినందనలు వెల్లివిరిసెరా లింగా..!

Posted: 03/22/2015 01:42 PM IST
Distributors thanks to rajinikanth

పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మినట్లు.. మొన్నటి దాక మంచోడు.. నిన్న మౌనం కారణంగా చెడ్డవాడుగా మారాడు.. మాళ్లీ తాజాగా ఇవాళ మంచోడయ్యాడు.. ఎంతలా అంటే ఆకాశానికి ఎత్తేసేంతలా.. ఇదంతా ఎవరి గురించో తెలుసా..? దక్షిణాధి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి.. తమిళ నాట డిస్ట్రిబ్యూటర్లకు ఆయన ఆరాధ్యుడు. మరోలా చెప్పాలంటే కోటి రూపాయలను పెట్టిన వారికి కానకవర్షం కురిపించిన కుబేరుడు. ఇంకోలా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్ల పాలిక కల్పవృక్షం. లాభాలను గడించిన సమయంలో మాకు అధిక లాభాలు వచ్చియని గొంతు ఎత్తి అరిచిన ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా దూర్ఫిణి పెట్టి వెలికినా కనబడలేదు.

గత కొంత కాలంగా ఆయన ఆయన సినిమాలు వరుస హిట్ జాబితాలో చేరకపోవడంతో.. డిస్ట్రిబ్యూటర్లు ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. తాజాగా లింగా చిత్రంతో నష్టం వచ్చే సరికి మాత్రం ఆయన పరుపు ప్రతిష్టలను బజారుపాలు చేస్తూ.. ఆందోళనలు, నిరసనలతో అట్టుడికించారు. వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు రజనీకాంత్ నడం చుట్టారు. లింగా చిత్ర నష్టపరిహారం వ్యవహారంలో  రూ. 10 కోట్లు తిరిగి చెల్లించడానికి సహకరించారు. దీంతో కథా నాయకుడు రజనీకాంత్‌కు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కృతజ్ఞతలతో కూడిన అభినందనలు తెలిపారు. దీంతో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు థాను దక్షిణ భారతచలన చిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, రజనీకాంత్ సుదీర్ఘ చర్చలు జరిపి చివరికి  రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించే విధంగా తీర్మానం చేశారు. ఇందుకు కృషి చేసిన రజనీకాంత్‌కు, కలైపులి ఎస్.థానుకు, శరత్‌కుమార్‌కు డిస్ట్రిబ్యూటర్లు అభినందనలు తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  super star  lingaa movie  

Other Articles