Balakrishna lion title controversy tollywood news

balakrishna lion movie, lion movie controversy, lion title controversy, jd lion movie news, jd lion movie shooting updates, balayya lion movie updats, trisha krishnan, radhika apte, satya deva director

balakrishna lion title controversy tollywood news : Tollywood new director creates controversy on lion movie title which is already used for balakrishna's 98 film.

బాలయ్య ‘లయన్’ టైటిల్ పై చెలరేగిన వివాదం

Posted: 03/20/2015 04:25 PM IST
Balakrishna lion title controversy tollywood news

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమాకి ‘లయన్’ టైటిల్ గా మూడునెలల కిందే ఖరారు చేశారు. నూతన సంవత్సర సందర్భంగా టీజర్ కూడా విడుదలైంది. దాదాపు ఈ మూవీ షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. త్వరలోనే విడుదలకు సిద్దంగా వుంది. అయితే.. ఇంతలోనే ఓ మూవీ డైరెక్టర్ ‘లయన్’ టైటిల్ తాను తెరకెక్కిస్తున్న సినిమాదంటూ తెరమీదకొచ్చి సరికొత్త వివాదానికి తెరలేపాడు.

జెడి దర్శకత్వంలో ‘లయన్’ పేరిట మరో మూవీ తెరకెక్కుతోంది. కొత్త తారాగణంతో రూపొందుతున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. గతకొన్నాళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియదు. అయితే.. ఈ మూవీ డైరెక్టర్ ఇప్పుడు తెరమీదికొచ్చి ‘లయన్’ టైటిల్ తన మూవీకి సంబంధించి అని సంచలనం రేపుతున్నాడు. తాను ఈ టైటిల్ ను 9 నెలల ముందే తెలంగాణా ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేయించానని, తన కథకు ఈ టైటిల్ బాగా సూటవుతుందన్న ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టానని అంటున్నాడు. అయితే.. ఇంతలోనే బాలయ్య సినిమాకు ఇదే టైటిల్ పెట్టారని తెలిసిందని అతను వాపోతున్నాడు. ‘లయన్’ టైటిల్ పై హక్కులు తనకే వున్నాయంటూ పేర్కొంటున్న జెడి.. బాలయ్య సినిమా టైటిల్ ని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం!

గతంలో ఈ టైటిల్ కి సంబంధించిన వ్యవహారంపై చర్చించేందుకు ఒకరిద్దరు కలిశారని జెడీ పేర్కొన్నాడు. కానీ.. అప్పట్లో దానిగురించి చర్చలేవీ జరగలేదని, తాను ఆ టైటిల్ ఇస్తానని చెప్పలేదని పేర్కొంటున్నాడు. అయితే.. తాను బాలయ్యకు వీరాభిమానినని, అన్నగారు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని అంటున్నాడు. కానీ.. ‘లయన్’ టైటిల్ హక్కులు తన దగ్గర వుండగా.. మరొక సినిమాకు ఎలా వాడుకుంటారంటూ తెలుపుతున్నాడు. మరి.. ఈ వివాదంపై బాలయ్య, ‘లయన్’ మూవీ యూనిట్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

నిజానికి బాలయ్య చిత్రం తెరకెక్కుతోందన్న రోజునుంచి ఈయన మూవీకి సంబంధించి పలు టైటిళ్లు తెరమీదికొచ్చాయి. అందులో ‘లయన్’ పేరు కూడా వినిపించింది. తర్వాత కొన్నాళ్లకు దాన్నే టైటిల్ గా ఖరారు చేస్తున్నట్లు యూనిట్ బృందం ప్రకటించింది. ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదలయ్యింది. రిలీజ్ కి కూడా సిద్ధంగా వుంది. మరి.. జెడి తన మూవీకి 9 నెలలముందే ఈ టైటిల్ ని రిజిష్టర్ చేయిస్తే.. ఇన్నాళ్లు ఎందుకు సైలెంట్ గా వున్నాడంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరి దీనిపై అతని కామెంట్ ఎలా వుంటుందో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna lion movie  lion movie updates  jd lion controversy  

Other Articles