Singham 123 movie poster release

singham 123 posters, sampoornesh babu news, singham 123 movie updates, singham 123 movie gallery, singham 123 movie news, singham 123 movie release date, sampoornesh babu updates

singham 123 movie poster release: Sampoornesh babu latest flick singham 123 movie poster released on ugadi festival

బర్నింగ్ స్టార్ ‘సింగం 123’ పోస్టర్ విడుదల

Posted: 03/21/2015 11:48 AM IST
Singham 123 movie poster release

ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. సంపూ నటించిన 'హృదయ కాలేయం' సినిమా ఇటివలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో సంపూకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

ఇందులో భాగంగానే సంపూతో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. వారి సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో సంపూ కనపడిన చాలు అనే విధంగా సంపూ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం సంపూ రెండు, మూడు చిత్రాల్లో హీరోగా నటిస్తూనే, మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. సంపూర్నేష్ బాబు హీరోగా డా. మంచు మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'సింగం123'.

అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మంచు విష్ణు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందిస్తున్నాడు. ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్ కు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా ఉగాది సందర్భంగా ఈ చిత్రంలోని సంపూ మరో పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో సంపూ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సంపూ నటిస్తున్న మరో రెండు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singham 123 movie updates  sampoornesh babu  

Other Articles