South indian actor madhavan gets bumper offer

south indian actor madhavan gets bumper offer, south indian actor madhavan gets hollywood offer, madhavan, madhavan latest news, madhavan movies, madhavan photos, madhavan hollywood debut movie, madhavan latest updates, madhavan movie news, madhavan cinema News, madhavan upcomming movies, madhavan new look, madhavan movie collections, madhavan bumper offer,

south indian actor madhavan gets bumper offer from hollywood

అసలైన బంఫర్ ఆఫర్ కొట్టిన మాదవన్..!

Posted: 03/15/2015 12:27 PM IST
South indian actor madhavan gets bumper offer

కాలీవుడ్ నుంచి టాలీవుడ్, సాండిల్ వుడ్ సహా దక్షిణాది ప్రేక్షకులకు అనునిత్యం గుర్తుండే చిత్రాల్లో నటించి.. తన నటన, అభినయానికి తోడు అనుకువతో అటు బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పలు చిత్రాలతో భారత్ సినీ అభిమానులందరికీ సుపరిచితుడైన హీరో మాధవన్ అసలైన బంపర్ ఆఫర్ కోట్టాడు. తన నటనాపరిధిని కొంచెం కొంచెంగా విస్తరించుకుంటూ యావత్ భారత దేశానికి వ్యాపింపజేసుకున్న.. మాదవన్ కు బంఫర్ ఆఫర్ ఏంటీ..? అనుకుంటున్నారా..? ఆయన తన నటనను విశ్వవ్యాప్తం చేయబోతున్నారు. అర్థం కాలేదా..? ఆయన ఇక ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ పరిచయం కాబోతున్నారు.

అదేనండి మాదవన్ కు ఏకంగా హాలీవుడ్ లో నటించే బంఫర్ ఆఫర్ వచ్చింది. ఇప్పటివరకూ దక్షిణ భారత దేశంలో ఏ నటుడికి రాని అవకాశాన్ని తొలిసారిగా కాజేసి.. తొలి నటుడిగా కీర్తి గడించనున్నాడు. ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్ కు చెందిన పలువురు నటులకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. కాగా దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరూ హాలీవుడ్ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడా క్రెడిట్‌ను కొట్టేశాడు మాధవన్. హాలీవుడ్‌లో హర్రర్ సినిమా అంటే మొదటగా గుర్తుకు వచ్చే ‘ఎవిల్ డెడ్’ సినిమా తాజా సిరీస్‌లో ఓ కీలక పాత్రకు మాధవన్ ఎంపికయ్యాడు. ఎవిల్ డెడ్ తాజా సిరీస్‌లో మాధవన్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం ఇరుదు సొత్తు అన్న ద్విభాషా చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్న మాధవన్ త్వరలోనే ఎవిల్ డెడ్ సిరీస్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhavan  hollywood debut movie  madhavan latest updates  

Other Articles