Balakrishna lion audio release date

balakrishna lion audio release datenandamuri balakrishna, balakrishna, balakrishna latest news, balakrishna movies, balakrishna photos, balakrishna lion movie, balakrishna forth comming 98th movie, balakrishna movie collections, balakrishna latest updates, balakrishna movie news, balakrishna cinema News, balakrishna upcomming movies, balakrishna new look, Trisha, Trisha latest news, Trisha movies, Trisha photos, Trisha lion movie, Trisha movie collections, Trisha latest updates, Trisha movie news, radhika apte, radhika apte latest news, radhika apte movies, radhika apte photos, radhika apte lion movie, radhika apte movie collections, radhika apte latest updates, radhika apte movie news,

balakrishna lion audio release date is expected to be on April 9th, movie to be released in the month end

బాలయ్య లయన్ చిత్రం ఆడియో రిలీజ్ తేదీ ఖరారు..?

Posted: 03/15/2015 11:54 AM IST
Balakrishna lion audio release date

సత్యదేవ దర్శకత్వంలో రూపోందుతున్న నందమూరి నటసింహం బాలకృష్ణ 98వ చిత్రం లయన్ ఆడియో త్వరలోనే విడుదల కాబోతుంది. ఎప్పుడు..? ఎక్కడ..? అనుకుంటున్నారా..? మీకే కాదు నందమూరి బాలయ్య అభిమానులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ 9న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సంకల్పించిందని సమాచారం. లయన్ చిత్రంతో తన అభిమానులకు మంచి విందునివ్వబోతున్నబాలకృష్ణ... అంతకన్నా ముందుగా వారికి ఆడియోను హిట్ అన్న గిఫ్ట్ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఆగండాగండీ... అక్కడికే వస్తున్నాం.. సినిమా ఆడియోను ఎక్కడ రీలీజ్ చేస్తున్నారనేగా మీ ప్రశ్న.. ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 9న శిల్పకళ వేదికలో గ్రాండ్ గా జరగనుందని సమాచారం. ఈ ఆడియో లాంచ్ కి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరు కానున్నారని సమాచారం.

రమారమి ‘లయన్’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని.. ప్యాచ్ వర్క్ సీన్స్ ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రధాన తారాగణంపై ఓ ఫ్యామిలీ సాంగ్ షూట్ ని ఫినిష్ చెయ్యడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందించాడు. లయన్ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీంతో అభిమానుల కనుల విందు తీరనుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత బాలయ్య డబుల్ రోల్ చిత్రం విడుదల కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆశలు రెట్టింపయ్యాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  lion audio  balakrishna latest updates  tollywood news  

Other Articles