Pawan kalyan son of satyamurthy audio function allu arjun trivikram srinivas

pawan kalyan, son of satyamurthy, pawan kalyan latest news, trivikram srinivas news, adah sharma news, nitya menon news, samantha ruth prabhu news, son of satyamurthy audio songs, pawan kalyan politics, pawan kalyan gabbar singh

pawan kalyan son of satyamurthy audio function allu arjun trivikram srinivas : Pawan kalyan not attending as special to son of satyamurthy audio function.

‘సన్నాఫ్ సత్యమూర్తి’కి ఝలకిచ్చిన పవన్

Posted: 03/13/2015 06:16 PM IST
Pawan kalyan son of satyamurthy audio function allu arjun trivikram srinivas

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన సమంతా, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్, సింధు తులాని కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇదిలావుండగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ ఈ మూవీకి అందిస్తున్న పాటలను ఈనెల 15వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! ఈ వేడుకకు ముందుగా పవన్, మహేష్ ఇద్దరు ముఖ్యఅతిథులుగా వస్తారని గతంలో ప్రచారం జరిగింది. వారిద్దరి కోసమే ఈ ఆడియో ఈవెంట్ ని హైటెక్స్ నోవాటెల్ లో భారీ ఖర్చు వెచ్చించి గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే.. కొన్నాళ్ల తర్వాత మహేష్ ఈ ఫంక్షన్ కి రాడని తేలిపోయింది. దీంతో పవన్ ఒక్కడే ఈ ఈవెంట్ కి హాజరవుతాడని ప్రచారాలు జరిగాయి. అంతేకాదు.. అతనికోసం ఈ మూవీ ఆడియో డేట్ ని యూనిట్ ఓసారి పోస్ట్ పోన్ కూడా చేసుకుని.. ఫైనల్ గా ఈనెల 15వ తేదీన ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. పవన్ రాకతో తమ మూవీకి మరింత క్రేజ్ వస్తుందన్న నమ్మకంతో దర్శకనిర్మాతలు ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది.

అయితే.. ఇంతలోనే పవన్ కల్యాణ్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మూవీ యూనిట్ కి పెద్ద ఝలకిచ్చినట్లు ఇండస్ట్రీలో చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. పవన్ ఈ మూవీ ఆడియో వేడుకకు రాలేనని దర్శకుడు త్రివిక్రమ్ కి కబురు పంపించినట్లు తెలిసింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులతోపాటు, తన గబ్బర్‌సింగ్- 2 చిత్రం షూట్ డైలమాలో వున్న పవన్.. ఆడియో వేడుకకు రావడం వీలుకాదని చెప్పేశాడట! దీంతో ఆ మూవీ యూనిట్ కాస్త అప్సెట్ అయినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  son of satyamurthy  trivikram srinivas  adah sharma  samantha  

Other Articles