Pk movie tamil remake kamal hassan raj kumar hirani bollywood gossips

aamir khan pk movie, aamir khan pk, aamir khan pk collections, pk movie collections, pk movie news, pk tamil remake, kamal hassan news, kamal hassan latest news, kamal hassan remake movies, kamal hassan photos, raj kumar hirani, raj kumar hirani interview

pk movie tamil remake kamal hassan raj kumar hirani bollywood gossips : Pk Movie director cum producer has finally clarifies that they are not making pk tamil remake.

తూచ్.. అదంతా అబద్ధం.. అసలా ఆలోచనే లేదు!

Posted: 03/13/2015 04:52 PM IST
Pk movie tamil remake kamal hassan raj kumar hirani bollywood gossips

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో నటించిన ‘పీకే’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. దొంగబాబాల అసత్య ప్రచారాలను నమ్మకూడదనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల వారిని ఆకర్షించడంతో వసూళ్లపరంగా సంచలనం సృష్టించింది.

ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన ఈ మూవీని  తమిళంలో రీమేక్ చేయనున్నట్లుగా ఆమధ్య రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే! అందులో అమీర్ పాత్రను లోకనాయకుడు కమల్ హాసన్ చేయనున్నాడని ప్రచారం కూడా జరిగింది. అయితే.. ఈ వార్తలన్నీ అబద్ధాలంటూ ఆ మూవీ దర్శకనిర్మాత రాజ్ కుమార్ హిరాణీ కొట్టిపారేశారు. ‘పీకే’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసే ఆలోచన తమకు అస్సలు లేదని ఆయన స్పష్టం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. అసలు దీనిని తమిళంలో రీమేక్ చేసే ఆలోచన కూడా మాకు లేదు. అయితే.. కొంతమంది తమిళ నిర్మాతలు ఈ మూవీ రీమేక్ హక్కులను అడిగిన మాట మాత్రం వాస్తవమే’ అని ఆయన వివరించాడు. ఇక కమల్ హాసన్ కూడా ఈ రీమేక్ లో తాను నటించడం లేదని గతంలో వెల్లడించిన విషయం విదితమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  pk tamil remake  kamal hassan  raj kumar hirani  

Other Articles