Nithya menon sister role in allu arjun movie

nithya menon sister role in allu arjun movie, nithya menon become sister of allu arjun, nithya menon in allu arjun movie, nithya menon in sister role, nithya menon as a sister, nithya menon in son of sathyamurthi, nithya menon movie news, nithya menon latest news, nithya menon movie updates, nithya menon latest interview, nithya menon latest stills, nithya menon stills, nithya menon gallery, nithya menon

nithya menon sister role in allu arjun movie: Heroine nithya menon upcoming telugu movie son of sathyamurthi. allu arjun hero, trivikram direction.

అన్నాచెల్లెల్లుగా అల్లు అర్జున్, నిత్యామీనన్... డాటర్ ఆఫ్ సత్యమూర్తి

Posted: 02/16/2015 11:36 AM IST
Nithya menon sister role in allu arjun movie

ముద్దుగుమ్మ నిత్యామీనన్ సినిమా ఎప్పుడూ వచ్చినా కూడా స్టార్ క్రేజ్ ను సొంతం చేసుకుంటుంది. ఈ అమ్మడు ఇటీవలే నటించిన ‘మళ్లీ మళ్లీ ఇదిరానిరోజు’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే నిత్యామీనన్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటిస్తుంది.

స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ... వరుస ఆఫర్లు వస్తున్న సమయంలో ఏ హీరోయిన్ కూడా స్టార్ హీరోకు సిస్టర్ పాత్రలో నటించడానికి అస్సలు అంగీకరించదు. కానీ సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి ఆలోచించవద్దని, నటిగా మంచి పాత్రలు ఏం వచ్చినా చేయాలని చెబుతోంది నిత్యామీనన్.

ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. అయితే బన్నీకి హీరోయిన్ గా కాకుండా ఇందులో చెల్లెలిగా నటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని నిత్యా వద్ద ప్రస్తావిస్తే చాలా తేలికగా జవాబు ఇచ్చేసింది. అంతే కాకుండా ఓ భారీ ఆఫర్ ను కూడా లాక్ చేసేసుకుంది.

ఈ విషయంపై నిత్యా స్పందిస్తూ... ఇందులో తప్పేంలేదు కదా! గతంలో షారుక్, ఐశ్వర్యాలు కూడా ‘జోష్’ సినిమాలో అన్నాచెల్లెలుగా నటించారు. ఆ తర్వాత ‘దేవదాసు’లో జంటగా నటించారు. ఇలాంటివన్నీ కూడా సినిమాల్లో సహజమే. అయినా ఇందులో నాకేమి తప్పు కనిపించడం లేదు. నేనేం ఫీల్ అవ్వట్లేదు అని చెబుతోంది.

అంతే కాకుండా బన్నీ తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా తనకు అవకాశం ఇస్తానని ప్రామిస్ చేసాడని నిత్యా చెబుతోంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ ను సొంతం చేసుకుంటున్న నిత్యా... ఇలాంటి సమయంలో ఇలా చెల్లెలి పాత్రలో నటిస్తే... భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి. మరి బన్నీ నటించబోయే తదుపరి చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. మరి ఈ స్టార్ ల జంట అన్నాచెల్లెలుగా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithya menon  sister  allu arjun  son of sathyamurthi  trivikram  movie  new  

Other Articles