Sunny leone leela movie trailer jay bhanushali bollywood news

sunny leone news, leela movie news, ek paheli leela movie trailer, leela movie trailer, leela movie videos, leela movie hot videos, leela movie gallery, leela movie photo shoot, leela movie hot, ek paheli leela movie, sunny leone bikini news, sunny leone hot photos

sunny leone leela movie trailer jay bhanushali bollywood news : The latest movie leela trailer released in which sunny leone playing in a lead role.

సన్నీ ‘లీలా’.. శృంగారప్రియుల గోల..

Posted: 02/06/2015 04:53 PM IST
Sunny leone leela movie trailer jay bhanushali bollywood news

మాజీ పోర్న్’స్టార్, బాలీవుడ్ సెక్సీ తార సన్నీలియోన్ తాజాగా ‘లీలా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్’కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అర్థనగ్నంగా ఒక కుర్చీ మీద రాణిలా కూర్చుని చాలా సెక్సీగా వున్న ఆ సన్నీ ఫోటోను తరించిన ప్రతిఒక్కరు.. గమ్మత్తుగా తమ భావాలను వ్యక్తపరిచారు. కేవలం ఫస్ట్ లుక్’తోనే తన బోల్డ్ నెస్’తో హీటెక్కిస్తున్న సన్నీ.. ఇక సినిమాలో ఏ రేంజిలో తన అందాలను ఆరబోసిందోనంటూ అప్పుడో కొందరు శృంగారప్రియులు గోల పెట్టడం మొదలుపెట్టేశారు కూడా! అయితే.. మూవీకన్నా ముందే ఎలాగూ ట్రైలర్ వస్తుంది కాబట్టి.. దానికోసం వేచి చూస్తున్నారు.

ఇక వారి కాలక్షేపం ముగిసినట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ అమ్మడు ‘లీలా’ మూవీకి సంబంధించి ట్రైలర్ విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ పోస్టర్’లో ఏ విధంగా ఈ అమ్మడు మత్తెక్కించిందో.. అదేవిధంగా ట్రైలర్’లోనూ తన గత శృంగార అనుభవాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. పైగా.. ఈ మూడునిముషాల నిడివిగల ట్రైలర్’లోనే ఈ మూడుపదుల తార కనిపించిన ప్రతిఒక్క సన్నివేశంలో బికినీ, స్లీవ్ లెస్, చిట్టిపొట్టి డ్రెస్సులు ధరించినవే ఎక్కువగా కనిపిస్తాయి. గత సినిమాలకంటే ఈ మూవీలోనే ఈ అమ్మడు చాలా బోల్డ్’గా నటించినట్లు కనిపిస్తోంది. ఈ విధంగా సెక్సీ కంటెంట్’తో విడుదలైన ఈ ట్రైలర్’కి అప్పుడే క్లిక్కుల మీద క్లిక్కులు వచ్చేస్తున్నాయి. ఇక అభిమానులైతే ఒకటే కామెంట్లు!

ఇక ఈ ట్రైలర్’లోనే మూవీ కథ ఏంటో దాదాపు విశ్లేషించారు. 300 సంవత్సరాల క్రితం ‘లీలా’ (సన్నీలియోన్) అనే అమ్మాయి అందాన్ని చూసి ముగ్ధుడైన ఒక రాజు.. ఆమెను వశపర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమెకు ప్రత్యేకంగా ఒక మూర్తి కట్టించాలనుకుంటాడు. కానీ.. లీలాకి ముందుగానే ఇంకొతనితో ప్రేమలో పడి వుంటుంది. ఆ విషయం తెలుసుకున్న రాజు.. అతడిని ఆమె ముందే హతమార్చేస్తాడు. తర్వాత ఆమె కూడా చనిపోతుంది. తిరిగి మళ్లీ వీళ్లిద్దరూ 300 ఏళ్ల తర్వాత జన్మిస్తారు. యుక్త వయస్సు రాగానే వీరికి మళ్లీ గతం గుర్తుకొచ్చి.. ఎక్కడైతే చనిపోయారో అక్కడే కలుసుకుంటారు. అయితే.. ప్రతి లవ్ స్టోరీలో విలన్లు వున్నట్లే వీరి కొత్త ప్రేమకథలో ఒకేసారి 3 విలన్లు చేరిపోతారు. ఇక వారి మధ్య గొడవలు, ఇతరత్ర సినిమా అంతా షరామామూలే!

ఈ మూవీలో ప్రత్యేకం ఏమిటంటే.. గతంలో ఐశ్వర్యరాయ్ నృత్యించిన ‘ఢోలీ తారో ఢోల్ బాజే’ అనే సాంగ్’ని ఇందులో రీమేక్ చేశారు. ఈ పాటలో సన్నీలియోన్ అద్భుతంగా నృత్యించింది. ఈ పాటకోసం ఎక్కువ ఖర్చుతో భారీ సెట్’ను ఏర్పాటు చేసి మరి షూట్ చేశారట! సన్నీమీద వున్న నమ్మకంతో ఈ మూవీకి బడ్జెట్ బాగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఇక సన్నీ సరసన టీవీ యాంకర్’గా పేరొందిన జయ భానుశాలి నటించాడు. బాబీ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone latest  ek paheli leela movie  bollywood news  

Other Articles