Priyanka chopra madamji mallika sherawat dirty politics movie news

priyanka chopra madamji mallika sherawat dirty politics movie news : priyanka chopra stopped her madamji movie politics. Because the movie script of that movie is similar to mallika sherawat's dirty politics movie.

ప్రియాంక మేడంజీని పక్కన పెట్టేశారు!

Posted: 02/06/2015 05:51 PM IST
Priyanka chopra madamji mallika sherawat dirty politics movie news

బాలీవుడ్’లో స్టార్ హీరోయిన్’గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రాకు అనుకోని పరాభావం ఎదురైంది. ఒక మూవీ కోసం ఈ అమ్మడు అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకుని వుండగా.. అందులో నుంచి ఈమె అర్థంతరంగా తొలగిపోవాల్సి వచ్చింది. మొన్నటివరకు ఆ మూవీ ఛాన్స్ రావడం వల్ల ఎగిరిగంతులేసిన ఈ భామ.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి పక్కకు రావడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఆ సినిమాను స్వయంగా నిర్మించడానికి ఈ అమ్మడు ఆసక్తి చూపించినా.. ఫలితం లేకపోయింది. ఇక చేసేది ఏమీలేక బుంగమూతి పెట్టుకుని తప్పుకోవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. గతకొన్నాళ్ల కిందట దర్శకుడు మధుర భండార్కర్ ఈమె ‘మేడంజీ’ అనే స్ర్కిప్టును వినిపించగా.. అది విని ఆమె ఎంతో ఇన్స్ పైర్ అయింది. దాంతో ఆమె ఆ సినిమాలో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాదు.. ఆ సినిమాను తానే నిర్మిస్తానంటూ వెల్లడించింది కూడా! ఒక బార్ డ్యాన్సర్ పెద్ద రాజకీయ నాయకురాలిగా పరిణామం చెందే కథాంశంతో కూడిన మూవీ అది! ఆ పాత్ర ఆమెను బాగా ఇంప్రెస్ చేయడంతో గెటప్ ఎలా వుండాలన్న విషయంపై కూడా ఎంతో వర్క్ చేసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇక సెట్స్’కి వెళ్లేందుకు సిద్ధంగా వుండగా... ఆ ప్రాజెక్ట్’ను అర్థంతరంగా నిలిపివేశారు.

ఆ మూవీని అలా నిలిపివేయడం వెనుక ఒక బలమైన కారణం వుంది. అదేమిటంటే.. సెక్సీ బ్యూటీ మల్లికా శెరావత్ తాజాగా ‘డర్టీ పాలిటిక్స్’ అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీలో మల్లికా షెరావత్ పాత్రలానే ప్రియాంక చోప్రా నటించాలనుకున్న ‘మేడంజీ’ పాత్ర వుండటంతో ఆమె డ్రాప్ అవక తప్పలేదు. అందుకే.. ప్రియాంక ఆ ప్రాజెక్టును పట్టాలమీద ఎక్కకముందే ఆపేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles