Akkineni nagarjuna daggubati venkatesh multistarrer movie masala sentiments

నాగ్-వెంకీల పరిస్థితీ అంతేనా..? ఇండస్ట్రీలో ‘మసాలా’ సెంటిమెంట్!

Posted: 01/21/2015 06:58 PM IST
Akkineni nagarjuna daggubati venkatesh multistarrer movie masala sentiments

ఇండస్ట్రీలో కొనసాగుతున్న కొన్ని ‘మసాలా’ సెంటిమెంట్ల కారణంగా.. వెంకీ, నాగార్జున ఇద్దరూ ఆందోళనలో మునిగిపోయినట్లు చెప్పుకుంటున్నారు. నిన్నటివరకు సవ్యంగానే జరుగుతుండగా.. ఇంతలోనే ఆ ‘మసాలా’ సెంటిమెంట్లు జోరుగా సాగుతుండటంతో అవి వీరిద్దరిని కాస్త ఇబ్బందుల్లో పడేసినట్లున్నాయి. అందుకే.. వాళ్లు తీవ్ర ఆలోచనల్లో పడిపోయారని టాలీవుడ్ టాక్! రానున్న రోజుల్లో వీరిద్దరి పరిస్థితి ఎలా వుంటుందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారట! అసలు ఏంటి ఆ ‘మసాలా’ సెంటిమెంట్లు..? వాటికి, ఈ ఇద్దరి హీరోలకు ఏంటి లింక్..? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయా..? అవన్నీ తెలియాలంటే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

సోలోగా హిట్ లభించడం లేదని భావించిన విక్టరీ వెంకటేష్.. మహేష్ బాబుతో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చెట్టు ద్వారా మల్టీస్టారర్ ట్రెండ్’ని క్రియేట్ చేయడంతోబాటు వరుసగా సక్సెస్’లు సాధిస్తున్న విషయం తెలిసిందే! దాదాపు పాతికేళ్ల తర్వాత వారిద్దరి కాంబోలో వచ్చిన ఆ మల్టీస్టారర్ మూవీ రూ.48 కోట్ల వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. అంతే! ఇక అప్పటినుంచి వెంకీ ఆ మల్టీస్టారర్ ట్రెండ్’నే ఫాలో అయిపోతున్నాడు. ఇప్పుడు పవన్’తో కలిసి ‘గోపాల గోపాల’ సినిమాతో డీసెంట్ హిట్’ని సాధించాడు. మొదట్లో మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు మాత్రం మాంచి కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.

ఇదిలావుండగా.. వెంకీ, నాగార్జున ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ తీయబోతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మూవీకన్నా ముందే దశరథ్ దర్శకత్వంలో వెంకీ సోలోగా ఓ మూవీ చేయాల్సి వుంది. ఆ మూవీ తర్వాతే నాగ్-వెంకీ మూవీ సెట్స్’పైకి వెళుతుంది. ఇప్పుడు వీరిద్దరి మూవీ గురించే ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అసలు ఈ మూవీ వీరిద్దరికి కలిసొస్తుందా..? లేదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మూవీ దగ్గరే ‘మసాలా’ సెంటిమెంట్లు బయటకు వస్తున్నాయి.

ఇక్కడ ‘మసాలా’ సెంటిమెంట్లు ఏమిటంటే.. మొదట్లో వెంకీ-మహేష్ నటించిన ‘సీతమ్మ..’ మూవీ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత వెంకీ-రామ్ కాంబోలో వచ్చిన ‘మసాలా’ మూవీ మాత్రం భారీ డిజాస్టర్’గా నిలిచింది. ఇప్పుడు వెంకీ-పవన్ కాంబోలో వచ్చిన ‘గోపాల గోపాల’ యావరేజ్ హిట్’గా నిలిచింది. మరి.. వెంకీ-నాగ్ కాంబోలో రాబోయే ఆ మూవీ పరిస్థితి ఏంటి..? ఆ మూవీ కూడా ‘మసాలా’లాగే డిజాస్టర్ అవుతుందా..? లేదా యావరేజ్’గానే నిలుస్తుందా..? అని చెప్పుకుంటున్నారు. టాలీవుడ్ సెంటిమెంట్ ప్రకారం.. వెంకీ-నాగ్’ల మూవీ ‘మసాలా’లాగే ఢమాల్ అయ్యే అవకాశాలు చాలా వున్నాయని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అందుకే.. ఈ ఇద్దరు హీరోలు తమ మూవీపై ఆందోళనగా వున్నట్లు చెప్పుకుంటున్నారు.

మరికొంతమంది అభిప్రాయాలు ఏమిటంటే.. నిజానికి ‘సీతమ్మ..’ మూవీలో వెంకటేష్’కి మహేష్ క్రేజ్ తోడవ్వడంతోనే ఆ మూవీ హిట్ అయిందని అంటున్నారు. అలాగే ‘గోపాల గోపాల’లో కూడా వెంకీకి పవన్ ‘పవర్’ తోడు కావడంతో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ భారీ కలెక్షన్లను రాబడుతోందని చెప్పుకుంటున్నారు. కానీ.. ‘మసాలా’లో వెంకీ మేనియా బాగానే పండినా, రామ్’కి అంతగా మార్కెట్ లేకపోవడంతో ఆ మూవీ ఫట్ అయ్యిందని వాదన! ఇప్పుడు వెంకీ-నాగ్ మూవీ విషయానికొస్తే.. ఇద్దరికీ యావరేజ్ పబ్లిసిటీ వుంది కాబట్టి వీరి కాంబోలో రాబోయే చిత్రం ఫట్ కాకపోయినా కనీసం యావరేజ్’గా నిలుస్తుందని విశ్లేషించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles