Soha ali khan kunal khemu marriage news

soha ali khan news, soha ali khan marriage, soha ali khan kunal khemu marriage, soha ali khan affairs, kunal khemu affairs, soha ali khan love affair, saif ali khan news, saif ali khan family members

soha ali khan kunal khemu marriage news : soha ali khan to marriage her boyfriend kunal khemu in this month on 25 in her house.

కునాల్ ముక్కుకు తాడు వేస్తున్న సోహా

Posted: 01/21/2015 03:44 PM IST
Soha ali khan kunal khemu marriage news

బాలీవుడ్ నటి - సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీఖాన్, నటుడు కునాల్ ఖేమూల మధ్య గతకొంతకాలం నుంచి ప్రేమాయణం కొనసాగుతున్న విషయం తెలిసిందే! గతంలో ఈ వ్యవహారంపై ఎంతో రచ్చ కూడా జరిగింది. కునాల్ నుంచి దూరంగా వుండాలంటూ సోహాను సోదరుడితోబాటు కుటుంబసభ్యులు హెచ్చరించిన సందర్భాలూ వున్నాయి. అయితే ఆమె మాత్రం వాటిని ఏమాత్రం భయపడకుండా కునాల్’తో తన బంధాన్ని కొనసాగించింది. తన జీవిత భాగస్వామి కునాలేనంటూ ప్రకటించింది కూడా! అంతేకాదు.. వీరిద్దరు సహజీవనం చేశారని ఆమధ్య వార్తలొచ్చాయి.

ఇప్పుడీ తతంగమంతా ఎందుకంటే.. ఈనెల 25వ తేదీన సోహా తన ప్రియుడి ముక్కుకు తాడు వేస్తున్నట్లు సమాచారం! అంటే.. వీరిద్దరి వివాహం జరనుంది. ఇటీవలే ఇరువురి కుటుంబసభ్యులు తమ పెళ్లికి అంగీకారం తెలిపినట్లు సోహా వెల్లడించింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘‘నా వివాహం మా ఇంట్లోనే నిరాడంబరంగా జరగనుంది. పెళ్లికి అన్నీ కార్యక్రమాలను సిద్ధం చేసుకుంటున్నాం. అయితే పెళ్లికి ఏ రంగు దుస్తులు వేసుకోవాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక అయోమయంలో పడిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : soha ali khan kunal khemu marriage  saif ali khan latest news  

Other Articles