Trivikram srinivas allu arjun latest movie title jadugar

allu arjun jadugar movie, allu arjun latest movie news, allu arjun trivikram movie, allu arjun samantha news, allu arjun adah sharma, allu arjun nitya menon, telugu jadugar movie updates, jadugar telugu movie updates, allu arjun jadugar movie news, trivikram movies, samantha latest movies, nitya menon latest movie

trivikram srinivas allu arjun latest movie title jadugar : According to the industry sources.. Jadugar title has fixed for trivikram srinivas and allu arjun movie. In this movie samantha, adah sharma and nitya menon playing in lead roles.

మాంత్రికుడి చేతిలో ‘జాదూగర్’గా మారిన బన్నీ!

Posted: 01/20/2015 10:13 AM IST
Trivikram srinivas allu arjun latest movie title jadugar

తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుని మాటల మాంత్రికుడిగా పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే! ఈ ఇద్దరి కాంబినేషన్’లో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తన స్వరాలతో ప్రేక్షకులను మైమరిపించే మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలావుండగా.. ఈ చిత్రానికి ఇంతవరకు ఎన్నో టైటిల్స్ పరిశీలనలో వచ్చాయి. ముందుగా దీనికి ‘త్రిశూలం’ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. మొన్నటివరకు దాదాపు ఇదే ఖరారవుతుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ‘హుషారు’ అనే మరో టైటిల్ పరిశీలనలో వచ్చింది. కానీ.. ఇప్పుడు దానిని కూడా ఫిక్స్ చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘జాదూగర్’ అనే టైటిల్’ని ఫిక్స్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం! ఈ టైటిల్ మూవీ కథకు, బన్నీ పాత్రకు బాగా సూటవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఒకవేళ టైటిల్ అదే అయితే.. కథ కాస్త వెరైటీగా వుంటుందని అంతా అనుకుంటున్నారు. తన జాదూతో విలన్లను బురిడి కొట్టించే విధంగానూ, లేదా ముగ్గురు హీరోయిన్లతో నడిపే ప్రేమ వ్యవహారాల్లో ఒకర్నొకరితో తప్పించుకుని తిరిగే నేపథ్యంలో కథ వుండివుండవచ్చునని అంతా చెప్పుకుంటున్నారు. ఏదైతేనేం.. వెరైటీ టైటిల్’తో ఊరిస్తున్న త్రివిక్రమ్-బన్నీ.. ప్రేక్షకులను తమ మాయలో పడగొట్టడంలో సఫలం అవుతారో లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles