Manchu vishnu new look

manchu vishnu new look, manchu vishnu first look, manchu vishnu arima nambi new look, manchu vishnu photos, manchu vishnu wall papers, arima nambi telugu remake updates, arima nambi remake latest, arima nambi telugu remake cast and crew, tollywood updates, latest telugu movie news, six pack heroes, telugu six pack heroes

manchu vishnu new look : manchu family hero Vishnu new look released in devekatta movie. vishnu works hard for armima nambi telugu remake. manchu hero new look for arima nambi remakes attracts fans

బాబుకు మెచ్చెమటలు పడుతున్నాయి

Posted: 12/26/2014 04:59 PM IST
Manchu vishnu new look

ఫ్యాన్స్ ను మెప్పించేందుకు హీరోలు పడే తంటాలు చెప్పరాదు. ఒక హీరో కండలు పెంచితే.., కాంపిటిషన్ గా మరో హీరో తయారవ్వక తప్పదు. అవసరం లేకపోయినా.., కొన్ని సార్లు సినిమాల కోసం కండలను కరగదీయాలి.., మరోసారి కండపట్టి ఉండాలి. ఇప్పటికే కండపట్టి ఉన్న మంచు విష్ణు ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పనిలో ఉన్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అరిమై నంబి’ తెలుగు రీమేక్ కోసం ఈ హీరో బాగా కష్టపడుతున్నాడు. కొత్త విద్య మంచును కరిగి..,  చెమట రూపంలో వదులుతున్నట్లుంది.

భారీ యాక్షన్ సన్నివేశాల కోసం బ్యాంకాక్ వెళ్లి మరీ విష్ణు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి లేటెస్ట్ ఫొటో విడుదల చేశాడు. ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన ఈ ఫొటో విష్ణులోని కసిని చూపిస్తోంది. ప్రత్యర్దిని కొట్టేందుకు సిద్ధమైనట్లగా ఉన్న ఫొటో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. విష్ణు రాగానే సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. బెంగాలీ భామ త్రిధ చౌదరిని ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు ‘సూర్య వర్సెస్ సూర్య’లో నటిస్తోంది.

ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన థ్రిలర్ మూవీ ‘అరైమ నంబి’ సూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమా హక్కులు తీసుకున్న విష్ణు తెలుగులో దేవకట్టాతో రీమేక్ చేయిస్తున్నాడు. కొద్దికాలంగా సరైన హిట్ సినిమాలు లేక మంచు ఫ్యామిలీకి ఈ మూవీ ఊరటనిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సినిమా కోసం విష్ణు పడుతున్న కష్టం ఫలించాలని కోరుకుందాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు మీకు అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu vishnu latest  arima nambi telugu remake  tollywood updates  

Other Articles