Gopala gopala motion poster records

gopala gopala, gopala gopala motion poster, gopala gopala motion poster record views, gopala gopala latest photos, gopala gopala wallpapers, pawan kalyan photos in gopala gopala, gopala gopala cast and crew, gopala gopala latest updates, gopala gopala movie release date, gopala gopala audio launch date, pawan kalyan latest updates, venkatesh latest updates, tollywood updates, 2015 telugu movies, upcoming telugu movies

gopala gopala motion poster records : pawan kalyan venkatesh multi starrer movie gopala gopala breaks records by motion poster views. gopala gopala had received huge response for its motion poster first look got more than one million clicks. pawan kalyan multi starrer movie have a song balance to complete. movie unit says gopala gopala completed in time and release for sankranthi.

పవన్ ఓ ట్రెండ్ సెట్టర్.. ‘గోపాల గోపాల’ రికార్డులు

Posted: 12/26/2014 05:40 PM IST
Gopala gopala motion poster records

పవన్ కళ్యాణ్ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా.., సౌత్ ఇండస్ర్టీలో పాపులర్ హీరో. ఈ విషయం గతంలో సర్వేలు కూడా నిరూపించాయి. తాజాగా ‘గోపాల గోపాల’ మూవీ మరోసారి ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది. గత నెలాఖరున సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. పవన్, విక్టరీ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరినీ ఈ పోస్టర్ ఆకట్టుకుంది. అంతేకాదు.., ఆన్ లైన్ వీడియో షేరింగ్ సైట్ యూ ట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసింది. మోషన్ పోస్టర్ కు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

గతంలో ఏ సినిమా మోషన్ పోస్టర్ కు ఇంతగా వ్యూస్ రాలేదు. ఇదంతా కేవలం పవన్ వల్లే అని స్పష్టం అవుతోంది. దీంతో ఇండస్ర్టీలో పవన్ కు ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ రికార్డులను చూసి టాలీవుడ్ ఫిలిం మేకర్లతో పాటు.., బాలీవుడ్ దిగ్గజాలు కూడా ట్రెండ్ సెట్టర్ అని కితాబిస్తున్నారు. అవును... పవన్ నిజంగా ఓ ట్రెండ్ సెట్టర్... లేదంటే నెల రోజుల్లోపు పది లక్షల వ్యూస్ ను పొందటం సాధారణ అంశం కాదు. పోస్టర్ కే ఈ స్థాయిలో స్పందన ఉందంటే.., సినిమా విడుదల అయితే కలెక్షన్ల సునామి వస్తుందని ఫ్యాన్స్ చెప్తున్నారు.

పవన్ - వెంకటేష్ కాంబినేషన్ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. కేవలం ఒక పాట మాత్రమే మిగిలి ఉన్నట్లు చెప్తున్నారు. ఇది పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా వచ్చేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరున సినిమా ఆడియో విడుదల చేస్తారని టాక్ వస్తున్నా.., అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మంచి స్పందన రావటంతో పాటలపై ఫ్యాన్స్ అంచనాలు పెరుగుతున్నాయి. కిశోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాట పడుతున్న ఫ్యాన్స్ కోసం అందరూ మోషన్ పోస్టర్ ను మరోసారి అందిస్తున్నాము.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala  pawan kalyan latest  venkatesh updates  

Other Articles