Pk movie critics response latest update

pk movie telugu review, pk movie review and rating, pk movie response critics, pk movie collections record list, aamir khan pk movie latest updates, pk movie latest photos teasers, bollywood latest news updates, tollywood latest news updates, aamir khan latest updates

pk movie critics response latest update : aamir khan latest movie pk got good response from all sides including critics, pk movie gets good collection opening on its first day

అమీర్ హ్యాపీ ఎండింగ్

Posted: 12/20/2014 12:17 PM IST
Pk movie critics response latest update

శుక్రవారం విడుదల అయిన అమీర్ ఖాన్ ‘పీకే’ సినిమా అందరి మన్ననలు పొందుతోంది. ఈ మూవీకి విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులు పడుతున్నాయి. అమీర్ మిగతా సినిమాలు ఒక ఎత్తు.., ఈ మూవీ మరొక ఎత్తు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. డిఫరెంట్ గెటప్స్ తో ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నారని చెప్తున్నారు. ఇక సినిమా కథ.., కథనం కూడా కొత్తగా ఉండటంతో ఏడాది చివర్లో వచ్చిన సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నారు. 2014లో అమీర్ కు ఈ మూవీ హ్యాపి ఎండింగ్ ఇస్తుందని తెగ కామెంట్ చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో అయితే పీ.కే. మూవీ తెగ ట్రెండింగ్ అంశంగా మారింది. దేశ వ్యాప్తంగా ఐదు వేలకు పైగా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా చాలా బాగుందనే స్పందన వచ్చింది. కామెడి యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా వీకెండ్ లో మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఈ మద్య కలెక్షన్ కింగ్ అయిన బాలీవుడ్ మూవీ ‘హ్యపీ న్యూ ఇయర్’ కంటే ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఇక సమీపంలో మరో బాలీవుడ్ మూవీ లేకపోవటంతో.., అమీర్ సోలోగా కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా తెలుస్తోంది.

తెలుగు రాష్ర్టాల్లో కూడా ‘పీకే’ సినిమాకు మంచి స్పందన వస్తోంది. మల్టీప్లెక్సులలో గతంలో ఏ సినిమాకు ఇవ్వనన్నీ షోలు ఈ మూవీకి ఇచ్చారంటే రెస్పాన్స్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి సెంటిమెంట్ అయిన క్రిస్టమస్ సమీపంలో సినిమా విడుదల ఈ దఫా కూడా వర్కవుట్ అయింది. ఖాన్ కష్టం ఫలించి మంచి రిజల్ట్ ఇవ్వటంతో మూవీ యూనిట్ పండగ చేసుకుంటోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pk movie collections  aamir khan latest  bollywood updates  

Other Articles