Allu arjun next movie raghavendra rao director

allu arjun raghavendra rao next movie, allu arjun next movie update, allu arjun dil raju movies, allu arjun trivikram movie latest updates, raghavendra rao tv show updates, soundarya lahari tv show updates, tollywood latest movie updates

allu arjun next movie raghavendra rao director : stylish star allu arjun presently working for trivikram srinivas movie film gossip that as per a tv show interview arjun will next work with raghavendra rao and this combination movie producer will be dil raju

నోటికొచ్చిందని చెప్పాడా లేక నిజంగానా....?

Posted: 12/16/2014 04:31 PM IST
Allu arjun next movie raghavendra rao director

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టులో నటిస్తున్న బన్నీ.., తర్వాతి సినిమా కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి డైరెక్టర్, నిర్మాతల పేర్లు మాత్రం పక్కాగా సెట్ అయ్యాయి. ఈ విషయాన్ని పరోక్షంగా బన్నీయే చెప్పాడు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాఘవేంద్రరావు నిర్వహిస్తున్న ‘సౌందర్య లహరి’ టీవీ షోకు ఇటీవలే అల్లు అర్జున్ వచ్చాడు. ఇంటర్య్వూ సమయంలో మరోసారి రాఘవేంద్రరావుతో కలిసి చేయాలని ఉందా అనే ప్రశ్న రాగా.., ‘ఈ ఆఫర్ రావటం నా అదృష్టం. ఇలాంటి ఆఫర్ వస్తే ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పాడు.

కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందిస్తూ.., ‘మీరిద్దరూ ఓకే అంటే ఈ ప్రాజెక్టును నేను నిర్మిస్తాను’ అని చెప్పాడు. ఇది వినటానికి బాగానే ఉన్నా.., వర్కవుట్ అవుతుందా అని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత ప్రాజెక్టులపై కసరత్తు జరుగుతోంది. ఈ లోగా రాఘవేంద్రరావు కథ సిద్దం చేసుకుని దానికి డేట్లు అడ్జస్ట్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కేవలం మాటవరసకు చెప్పాడా.. లేక నిజంగానే కోరికను చెప్పాడా అనేది తెలియాల్సి ఉంది.

బన్నీ తొలి సినిమా ‘గంగోత్రి’ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిందే. ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ చెల్లి అదితి అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చింది. ఈ సినిమా మ్యూజికల్, కమర్షియల్ హిట్ అయినా.., బన్నీ హీరోయిజం చూపించేందుకు ఉపయోగపడలేదు. దీని తర్వాత వచ్చిన సినిమాలు స్టైలిష్ స్టార్ మ్యానరిజంను పెంచుకుంటూ పోయాయి. ఇప్పుడు రాఘవేంద్రుడు సినిమా తీయాలి అనుకుంటే.., వీటిని మించేలా ఉండాలి. అప్పుడుగానీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఈ మాటలు చివరకు ఏమవుతాయో లెట్స్ వెయిట్ అండ్ సీ.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun next movie  raghavendra rao tv show  dil raju movies  

Other Articles

Today on Telugu Wishesh