Pawan kalyan next movie music director anoop rubens

anoop rubens on pawan kalyan, anoop rubens pawan kalyan message, pawan next movie music director anoop rubens, anoop rubens songs, gabbar singh 2 movie music director, gabbar singh2 cast and crew, tollywood latest news updates

pawan kalyan next movie music director anoop rubens : anoop rubens is on peak of happiness mountain with pawan kalyan call, anoop rubens says pawan kalyan called him and says that he loves rubens music soon they will work combined

పవన్ కు నచ్చితే అంతే.. పర్సనల్ కాల్ తో పొంగిపోతున్న...

Posted: 12/16/2014 03:44 PM IST
Pawan kalyan next movie music director anoop rubens

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచితనం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. తనకు నచ్చితే.., కావాలి అనుకుంటే, తన వారనుకుంటే వారి కోసం ఏమైనా చేసే మంచి మనసు పవర్ స్టార్ ది. ఆయనకున్న మంచితనమే పబ్లిక్ ఐకాన్ చేసి.., పార్టీల విజయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి తీసుకెళ్ళింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎందరో చిన్న కళాకారులు, ఇండస్ర్టీనే నమ్ముకున్న వారికి తన సినిమాల్లో వీలైనంతగా అవకాశం ఇచ్చి ఆదుకోవటం పవన్ కు ఉన్న మంచిగుణం. తన తాజా సినిమా ‘గోపాల గోపాల’ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ను కూడా పవన్ ప్రశంసలతో ముంచెత్తాడు. పవన్ ప్రశంసలతో ఆనందాన్ని అనూప్ తట్టుకోలేక పోతున్నాడు.

పవన్ కళ్యాణ్ అనూప్ కు స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకున్నాడట. రూబెన్స్ సంగీతంకు ఫిదా అయిన పవన్ త్వరలోనే కలిసి పని చేద్దామని చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా అనూప్ రూబెన్స్ ట్విట్టర్ లో (‘‘PSPK OMG!Best day of my life!!! PawanKalyan sir just called and said'I Luv u Anup!'Next line he said was'We are working soon!'Delighted.’’) వెల్లడించాడు. ఈ మద్య వచ్చిన ‘గోపాల గోపాల’ మోషన్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో పాటు వెనక వచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అందర్ని ఆకట్టుకుంది. చాలామంది యువత ఈ ట్యూన్ ను మొబైల్ రింగ్ టోన్ గా పెట్టుకున్నారు.

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు మంచి స్పందన వచ్చినట్లు తెలుసుకున్న పవన్ స్వయంగా ఫోన్ చేసి మెచ్చుకోవటంతో అనూప్ పట్టలేని సంతోషంతో ఉన్నాడు. ఇక సినిమా విషయానికి వస్తే.., సంక్రాంతి బరిలో నిలిచిన ‘గోపాల గోపాల’ మూవీ జనవరి 14 విడుదల కోసం శరవేగంగా సిద్దమవుతోంది. ఈనెల 28న ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం జరగనుంది. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కిషోర్ డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anoop rubens songs  gopala gopala updates  pawan kalyan movie latest  

Other Articles