Rajinikanth lingaa movie tickets fans craze

lingaa movie release, lingaa movie tickets, lingaa movie latest updates, lingaa movie review, lingaa movie photos posters, lingaa movie trailers teasers, koliwood latest movie updates, tollywood latest movie updates, rajinikanth upcoming movie updates

lingaa movie tickets fans craze : rajinikanth fans craza about lingaa movie, ticktes in online mode and offline mode is completely sold out before release, lingaa movie theaters full before its release by pre booking tickets

విడుదలకు ముందే హౌజ్ ఫుల్... మండిపడుతున్న రజినీ ఫ్యాన్స్

Posted: 12/11/2014 08:32 AM IST
Rajinikanth lingaa movie tickets fans craze

అభిమానుల గుండెల్లో దేవుడైన రజినీని వెండి తెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ‘లింగా’ సినిమాను చూసేందుకు తహతహలాడుతున్నారు. టికెట్ల కోసం పోటిపడుతున్న ఫ్యాన్స్ ను చూస్తేనే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అర్థమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 12న విడుదల అవుతున్న ‘లింగా’ను చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ మోడ్ లలో టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. తమిళ నాట మొదటి వారం రోజులకు ఏ థియేటర్ లో కూడా టికెట్లు అందుబాటులో లేవు.

ఇక టాలీవుడ్ లో కూడా సేమ్ సీన్ ఉంది. శుక్రవారం తో పాటు వారాంతంలో కూడా టికెట్లు అందుబాటులో లేవు. తెలుగులో ప్రమోషన్ తక్కువగానే జరిగినా., రజినీకి ఉన్న ఫ్యాన్ క్రేజ్ వల్ల థియేటర్లు విడుదలకు ముందే ఫుల్ అయినట్లు యజమానులు చెప్తున్నారు. అయితే మాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రి బుకింగ్ టికెట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రి బుకింగ్ వల్ల తమలాంటి వారికి టికెట్లు దొరకటం లేదని మండిపడుతున్నారు. సినిమా టికెట్లు అన్నీ ముందే అమ్మేసుకుంటే తమలాంటి వారు మొదటి రోజు సినిమా ఎలా చూస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాట కూడా ‘లింగా’ఫీవర్ తో హీటెక్కిన ఫ్యాన్స్, సినిమా విడుదలయితేనే చల్లబడే అవకాశముంది. రజినీ పుట్టినరోజు కానుకగా వస్తున్న ఈ మూవీ ఆయనకు బర్త్ డే గిఫ్ట్ గా మారుతుందని ఆశిస్తున్నారు. సూపర్ స్టార్ డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో సోనాక్షి సిన్మా, అనుష్క శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో మూడ్రోజుల క్రితమే సినిమా పాటలు విడుదల అయ్యాయి. కోర్టు కేసులు చుట్టుమడుతున్నా.., సినిమా విడుదలపై యూనిట్ వర్గాలతో పాటు, ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa movie updates  rajinikanth fans latest  lingaa movie theaters  

Other Articles