Trisha enjoying with her boy friend

Trisha, Trisha latest news, Trisha Twitter posts, Trisha hot photos, Trisha photo shoot, Trisha photo gallery,Trisha interview, Trisha comments actresses, Trisha press meet, business man varun maniyan, Trisha varun maniyan relation, Trisha comments varun maniyan, Trisha love affair, Trishavarun maniyan love, Trisha varun maniyan engagement, Trisha varun maniyan jokky Trip photos, trisha taj trip, trisha mecca masjid visit

Trisha visits taj mahal and mecca masjid with her Fiance in a private aeroplane

ఏం.. ఇలా చేస్తే కూడా తప్పంటారేం..?

Posted: 12/10/2014 07:45 PM IST
Trisha enjoying with her boy friend

దక్షిణాది సిల్వర్ స్రీన్ ఏలి.. తన కంటూ క్వీన్ ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ త్రిష ఇటీవలే ఒకరితో సగం పెళ్లి చేసుకుంది. అదేనండీ నిశ్చితార్థం చేసుకుంది. అదీ ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం చేసుకుంది. గుట్టుగా వుండాల్సిన విషయం కాస్తా.. ఆ నోటా, ఈ నోటా పడి అందరికీ తెలిసిపోయింది. ఇక దాపరికం ఎందుకనుకుందో ఏమో ఈ బుంగమూతి చిన్నది తనకింక అడ్డు అదుపు లేదన్నట్టు వ్యవహరిస్తోంది. తన కాబోయే మొగుడితో అదేనండి మరో బాషలో చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్ మరియు స్నేహితులతో కలిసి త్రిష టూర్ లో తెగ ఎంజాయ్ చేస్తోందట. ఇటీవలే త్రిష ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించుకొంది. అలాగే మక్కా మసీదును కూడా దర్శించుకున్న  ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

ఈ టూర్ కు త్రిష బృందాన్ని ప్రత్యేక విమానంలో వెళ్లగా.. స్పాన్సర్ గా కాబోయే వరుడు అదేనండీ వరుణ్ లక్షల రూపాయాలను వెచ్చించాడట. ఎలాగో నిశ్చితార్థం గురించి అందరికి తెలిసిపోయింది కాబట్టి... ఇక ఇలా పెళ్లికి ముందే కాస్త విహార యాత్రలో తిరిగి ఎంజాయ్ చేయాలని భావించారో ఏమో కానీ... త్రిష తన బృందంతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. తాను ఎంజాయ్ చేస్తున్నప్పడు దిగిన ఫోటోలను తానే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తోంది.

ఇదిలా వుంటే త్రిష తల్లి మాత్రం పెళ్లి పనుల్లో బిజీగా వున్నట్లుగా తెలుస్తోంది. త్రిష తన స్నేహితులతో కలిసి టూర్ వెళ్లిందని, అయితే తనకు మాత్రం ఇక్కడ చాలా పనులుండటం వల్ల వెళ్లడం కుదర్లేదని త్రిష తల్లి ఉమ తెలిపారు. అయితే త్రిష పెళ్లి భగవంతుడి చేతిలో వుందని, భగవంతుడు దయతలిస్తే వచ్చే ఏడాది త్రిష వివాహం జరగవచ్చు అని చెప్పుకొచ్చారు. కానీ కోలీవుడ్ సినీవర్గాలు మాత్రం... త్రిష పెళ్లి ఏర్పాట్లు చేయడానికి ఉమ టూర్ కు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయిందని... ప్రస్తుతం త్రిష ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తవ్వగానే పెళ్లి చేయబోతున్నారని గుసగుసలు పెడుతున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha krishnan  trisha with boyfriend  actresses affairs  

Other Articles