Priyanka chopra slams voluntary organisation

priyanka chopra slams NGO, priyanka too approaches court, priyanka on item song, priyanka on item song dancers, priyanka on violence against women, priyanka on crime against women, priyanka on NGO, priyanka on men

priyanka chopra slams voluntary organisation and said that she too will approach court on item songs. All the irresponsible males who make filthy statements on women should wear langas she adds.

వాళ్లు లంగాలు కట్టుకుని తిరగాలంటోన్న ప్రియాంక

Posted: 12/10/2014 06:03 PM IST
Priyanka chopra slams voluntary organisation

మగాళ్లంతా లంగాలు కట్టుకుని తిరగితే చూడాలని వుందంట ఆ హాట్ బ్యూటీచి. ఇటీవలే అసియా ఖండం అందగెత్తగా తన కీర్తిని మరింత రెట్టింపు చేసుకున్న ఈ భామ ప్రియాంక చోప్రాకు మగాళ్ల మీద ప్రేమ లేక ద్వేషమా తెలియదు కాని మగళ్లాంతా లాంగాలు కట్టుకోవాలని ఒక బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. అయితే అందర మగళ్లాను తాను టార్గెట్ చేయలేదంటోంది. కేవలం ఆడవాళ్లను టార్గెట్ చేసి మాట్లాడే మగవాళ్లనే తాను లంగాలు కట్టుకుని తిరగాలని అంటోంది. మహిళలపై బాధ్యత లేకుండా కామెంట్లు చేసే మగాళ్లంతా లంగాలు కట్టుకోవడమే ఉచితమని మగజాతిపై వున్న అక్కస్సును వెళ్లగక్కింది.

అంతేకాదండోయ్.. మీరు అసలు మగాళ్లేనా? అంటూ మగాళ్లపై అంతెత్తున లేచింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మకి అంత కోపం రావడానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఐటం సాంగ్ లో నటించడమేనంటోంది. సినిమాల్లోని ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేసే వారందరనీ వ్యభిచారిణులుగా గుర్తించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఓ సంస్థ ప్రకటించింది. కేవలం ఐటెం సాంగ్స్ లో నర్తించే హీరోయిన్లు ఒంటిపై చిన్న, సన్నని వస్త్రాలు ధరించి అంగాంగ ప్రదర్శనలు చేస్తారని, అలా చేసేందుకు కోట్లలో పారితోషికం అందుకుంటున్నారని ఆ సంస్థ తెలిపింది.

రికార్డింగ్ డాన్సుల్లో నర్తించేవారిని వ్యభిచారిణులుగా అరెస్టు చేస్తున్నప్పుడు, సినిమాల్లో డబ్బు కోసం ఐటెం సాంగ్స్ లో నర్తిస్తూ, కోట్లాది మందిని రెచ్చగొట్టేలా డ్రెస్సులు వేసుకుంటున్న హీరోయిన్లను ఎందుకు వ్యభిచారిణులు అని అనకూడదని సదరు సంస్థ ప్రశ్నించింది. దీనిపై ప్రియాంక చోప్రాకు ఎక్కడో మండింది. స్త్రీలపై అఘాయిత్యాలను ఖండించాల్సింది పోయి, అర్ధం లేకుండా మాట్లాడతారా? అంటూ ప్రియాంక చోప్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం స్కర్టులు వేసుకోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయనడం అమానుషం అని పేర్కొంది.

కామాంధుల చర్యలను తప్పుబట్టడం మానేసి, మహిళల వస్త్రధారణను వేలెత్తి చూపుతారా? మీరసలు మగాళ్లేనా? అంటూ సదరు సంస్థపై మండిపడ్డారు. ఈ విషయంలో తాను కూడా కోర్టుకు వెళతానని ఆమె పేర్కొన్నారు. ఐటెం సాంగ్స్ లో నర్తించడం వ్యభిచారం ఎలా అవుతుందో తాను కూడా తేల్చుకుంటానని ఆమె ప్రతినబూనారు. ఇలా మహిళలపై బాధ్యత లేకుండా కామెంట్లు చేసే మగాళ్లంతా లంగాలు కట్టుకుని తిరిగేలా ఆజ్ఞాపించాలని న్యాయస్థానాన్ని కోరతానని ప్రియాంక చెప్పింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka chopra  bollywood news  item song  

Other Articles