Anushka sharma talks about her star life

Anushka sharma, anushka sharma latest news, anushka sharma press meet, anushka sharma hot photos, anushka sharma photo shoot, anushka sharma photo gallery, anushka sharma interview, anushka sharma comments actresses, virat kohli, anushka sharma virat kohli relation, anushka sharma comments virat kohli, anushka sharma love affair, anushka sharma virat kohli love affair

Anushka sharma talks about her star dom in the begining of her film career

స్టార్ హీరోయిన్ క్రేజ్ రావాలంటే..? ఇలా చేయాలా..?

Posted: 12/10/2014 06:28 PM IST
Anushka sharma talks about her star life

టాప్ హిరోయిన్ కావాలంటే ఏం చేయాలో.. ఏం చేయకూడదో గెలిచిన వారి కంటే ఒడిన వారికే ఎక్కువగా తెలుస్తుంది. ఇప్పుడు ఓటమి అంచుల నుంచి.. నేర్చుకున్న పాఠాల నుంచి.. పైకి ఎదిగిన వారు చాలా తక్కువ మందే. ఎందుకంటే నటన బాగున్నా.. అవకాశం కూడా రావాలి కదా..? ఒక్క చాన్స్ అంటూ కోరుకునే హీరోయిన్లు తమ ప్రతిభ కనబర్చినా.. సినిమా హిట్ కాలేందంటే.. వారి జాతకం మారిపోయినట్లే. అలా నటనా, అవకాశం కలసి వచ్చన అతి కొద్ది మంది.. ఇంకా బాలీవుడ్ మనగులుగుతూ.. టాప్ హీరోయిన్లుగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో అనుష్క శర్మ ఒకరు.

సినిమా రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ఆమె ఇంటర్య్వూ తీసుకునేందుక కూడా ఎవరూ ముందుకు రాలేదట. ఎంతో ఆశతో సినిమా ప్రయోషన్ వర్క్ కోసం వెళ్లినా.. తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో నొచ్చుకున్న అనుష్క.. చిన్నబుచ్చుకుందట. అంతేకాదు.. తనను ఎందుకు పట్టించుకోవడం లేదని తనలో తానే మదనపడి, ఓదార్చుకుని.. టాప్ రేంజ్ హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందట. అందుకు పగలు, రాత్రి తీవ్రంగానే కష్టపడి.. చివరకు సాధించింది. అయితే ఈ విషయాలన్నీ ఇటీవల తానే స్వయంగా చెప్పుకోచ్చింది లేండి.

అప్పుడు పట్టించుకోవడం లేదని మదనపడిన అనుష్క శర్మ.. ఇప్పడు తన వెనకెందుకు పడుతున్నారంటూ విసిగివేసారిపోతోంది. ‘రబ్ నే బనాదీ జోడి’ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఆ తర్వాత చేసిన ‘బ్యాండ్ బజా బారాత్’ సినిమా ఘనవిజయం సాధించడంతో కొంత క్రేజ్ ఏర్పడింది. క్రేజీ హీరోయిన్ అయినందుకు కాదండి తన హాట్ రోమాన్స్తో అటు బీ టౌన్ ను షేక్ చేయడమే కాకుండా ఇటు క్రికెట్ అభిమానులను కూడా తనవైపు తిప్పుకుంది. అదేలేండి.. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీతో ప్రేమాయణం నడుపుతూ.. ఇటు తన అభిమానులు, అటు తన బాయ్ ఫ్రెండ్ అబిమానులను అటెన్షన్ ను అందిపుచ్చుకుంటోంది.

ప్రస్తుతం వీరి మధ్య అలాంటి ప్రేమాయణం ఏమి లేనట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఈ అమ్మడికి ఇంత క్రేజ్ రావడానికే విరాట్ ను ప్రేమ పేరుతో వాడుకుందా అని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితేనేం స్టార్ హీరోయిన్ క్రేజ్ రావాలంటే ఇలాకూడా చేయవచ్చని చెప్పకనే చెబుతోంది. అనుష్క నటించిన ‘పీకే’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అమీర్ ఖాన్, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కాబోతుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles