Rajnikanth linga movie release date december small budget movie boxoffice collections telugu star heroes festival movies

rajnikanth, rajnikanth latest news, rajnikanth linga movie, linga movie news, linga movie release date, linga movie budget, rajnikanth linga movie news, telugu small buget movies, telugu movies, pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan movies, pawan kalyan gopala gopala movies, pawan kalyan venkatesh movie, i movie news, temper movie news, sankranti festival

rajnikanth linga movie release date december small budget movie boxoffice collections telugu star heroes festival movies

లో-బడ్జెట్ సినిమాలకు రజనీ ఆనకట్ట!

Posted: 12/01/2014 01:37 PM IST
Rajnikanth linga movie release date december small budget movie boxoffice collections telugu star heroes festival movies

గతకొంతకాలం నుంచి టాలీవుడ్’లో చిన్నసినిమాలు బాగానే సందడి చేస్తున్నాయి. భారీ బడ్జెట్’తో నిర్మించిన సినిమాలన్నీ సేమ్ కాన్సెప్ట్స్’తో రిపీట్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతుండగా.. వైవిధ్యభరితమైన కథాంశాలతో తెరకెక్కుతున్న చిన్నసినిమాలు మాత్రం బాగానే కలెక్షన్లు రాబడుతున్నాయి. మహేష్, చెర్రీలతోబాటు ఇతర హీరోలు నటించిన సినిమాలు డిజాస్టర్’గానే నిలవడంతో చిన్న సినిమాలకు ప్లస్ పాయింట్ అయింది. వారానికోసారి వరదలా పొటెత్తిన చిన్నసినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుని బాగానే సక్సెస్ పొందాయి. అయితే.. ఇప్పుడు ఆ చిన్నసినిమాలకు సూపర్’స్టార్ రజనీకాంత్ ఆనకట్ట కట్టడానికి సిద్ధమయ్యారు.

రజనీ నటించిన ‘లింగ’ సినిమా డిసెంబర్ 12వ తేదీకి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా వుంది. ఈ ఏడాది చివర్లో వస్తున్న బడా సినిమా అదొక్కటే! ‘కొచ్చాడయాన్’ డిజాస్టర్ కావడంతో అభిమానులతోబాటు రజనీ కూడా తీవ్రనిరాశకు గురికావడంతో ఇప్పుడు ‘లింగ’ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదలకోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక రజనీ సినిమా వస్తున్న నేపథ్యంలో విడుదలయ్యే ఇతర చిన్నసినిమాలకు మాత్రం గండిపడినట్టే! ఎందుకంటే అటు తమిళంతోబాటు తెలుగులో రజనీకి భారీ ఫాలోయింగ్ వుంది. విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ఇక రిలీజ్ తర్వాత ఎంతమేరకు కలెక్షన్లను సాధిస్తుందో అంచనాలు వేయలేము.

అంతేకాదు.. రజనీ సినిమా వచ్చిన తర్వాత సంక్రాంతి కానుకగా తెలుగు బడాహీరోల సినిమాలు కూడా లైన్’లో వున్నాయి. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, విక్రమ్ (ఐ సినిమా) వంటి స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇక వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమా క్రిస్మస్ కానుకగా విడుదల అవుతోంద. అలాగే నితిన్ ‘చిన్నదాన నీ కోసం’ కూడా డిసెంబర్ చివరిలో విడుదల అవుతుంది. ఈ విధంగా ఈ పెద్ద సినిమాలు వరుసగా రావడం వల్ల చిన్నసినిమాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశాలు వున్నాయి. అయితే వీటన్నింటికంటే రజనీ మూవీ ముందుగా వస్తోంది కాబట్టి.. ఆ చిత్రం ద్వారానే చిన్నసినిమాలకు అడ్డుకట్ట పడుతోంది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles