Imran hashmi mohammad azharuddin life story movie producer ekta kapoor kunal deshmukh

imran hashmi, imran hashmi latest news, mohammad azharuddin, imran hashmi azharuddin news, azharuddin movies, imran hashmi movies, imran hashmi kissing scenes, ekta kapoor hot photos, ekta kapoor hot photo shoot, ekta kapoor serials, ekta kapoor movies, ekta kapoor affairs, ekta kapoor cleavage show, ekta kapoor hot stills, director kunal deshmukh

imran hashmi Mohammad Azharuddin life story movie producer ekta kapoor kunal deshmukh : Serial kisser Imran Hashmi to play former cricketer azharuddin role in his latest bollywood flick which is produced by ekta kapoor and directed kunal deshmukh

అజారుద్దీన్ పాత్ర ఓ సవాల్ వంటిదట!

Posted: 12/01/2014 01:29 PM IST
Imran hashmi mohammad azharuddin life story movie producer ekta kapoor kunal deshmukh

ఈమధ్య చిత్రపరిశ్రమలో చారిత్రకారులు, ప్రముఖ దిగ్గజాలు, క్రీడారంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన వారి జీవితకథ ఆధారంగా తెరకెక్కే సినిమాలు చాలా ఎక్కువైపోతున్నాయి. అటువంటి సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా లభించాయి. అంతేకాదు.. మంచి కలెక్షన్లతోబాటు కొంతమందికి ఆదర్శంగా నిలిచాయి కూడా! అందుకే దర్శకనిర్మాతలు ఆ తరహాలోనే చిత్రాలను తెరకెక్కించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా కూడా త్వరలోనే తెరకెక్కబోతోందని సమాచారం!

అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కతున్న ఆ చిత్రంలో అతని పాత్రను సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ పోషించనున్నాడు. ఈ సందర్భంగా హష్మీ మాట్లాడుతూ.. అజారుద్దీన్ పాత్ర తనకు సవాల్ వంటిదని పేర్కొన్నాడు. రెండున్నర గంటల్లో అజ్జూ భాయ్ జీవితాన్ని చూపించడం నిజంగా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అందుకు ఎంతో ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నాడు. క్రీడా నేపథ్యమే అయినా, సినిమాలో ఎక్కువగా అతని జీవితమే కనిపిస్తుందని అన్నాడు. భారతదేశానికి ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన అజార్ పాత్రలో తాను నటించడం ఎంతో ఆనందంగా వుందని వెల్లడించాడు.

టెలివిజన్ సీరియల్స్ నిర్మించడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకున్న నిర్మాత ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్స్, ఇంకా ఇతర పాత్రలలో ఎవరు నటించనున్నారనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏక్తా పేర్కొంది. సీరియల్ కిస్సర్’గా పేరొందిన ఇమ్రాన్ ఇందులో నటిస్తున్నాడు కాబట్టి.. ఈ చిత్రంలో కూడా కొన్ని రక్తికట్టించే సన్నివేశాలు వుండొచ్చని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : imran hashmi  mohammad azharuddin  ekta kapoor  kunal deshmukh  bollywood news  telugu news  

Other Articles