Tamannaah bhatia and samantha focus on koliwood chances

tamannaah next movie, tamannah movies in tamil, tamanna latest movies, tamannah with santhanam, samantha next movie in tamil, samantha next movie in telugu, samantha latest movies, tollywood latest updates, koliwood latest updates news

Tamannaah Bhatia and samantha focus on koliwood chances : telugu star heroine samantha opened hit count in koliwood with kaththi movie and focused to do more tamil movies to highlight in industry. tamannaah bhatia to act opposite santhanam in tamil movie and trying to get more tamil offers

కొత్త రెక్కలు వచ్చాయి.. ఎగిరిపోయేందుకు సిద్దమయ్యారు

Posted: 11/12/2014 11:30 AM IST
Tamannaah bhatia and samantha focus on koliwood chances

ఇండియన్ ఫిలిం ఇండస్ర్టీల్లో బాలీవుడ్ టాప్ అని తెలుసు. కాని తమిళ ఇండస్ర్టీ మాత్రం వీటన్నిటికి ప్రాణం లాంటిదని చెప్పాలి. ఇక సౌత్ లో అయితే కోలీవుడ్ అంటే సినిమాలకు పెట్టింది పేరు. అక్కడి నుంచి పుట్టిందే టాలీవుడ్. ఇప్పుడు తెలుగు పరిశ్రమ తమిళంను తలదన్నే రేంజ్ లో ఉన్నప్పటికీ.., కోలీవుడ్ పై నటుల్లో క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు సౌత్ కు వచ్చారంటే ముందుగా చూసేది కోలీవుడ్ నే. అక్కడ హిట్ కొడితే ఆ తర్వాత ఆఫర్లు వాటంతట అవే వస్తాయని నమ్మకం. అందుకే అందరూ కోలీవుడ్ సినిమాల కోసం కలలు కంటారు.

కోలీవుడ్ పుట్టినింట్లో పుట్టినా.., అక్కడ అంతగా ఆదరణ పొందని సమంత తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక టైంను బట్టి మనసు, మాట ఉండే చెన్నై చిన్నది ఇప్పుడు తమిళ ఇండస్ర్టీపై దృష్టి పెట్టింది. తాజాగా ‘కత్తి’ సినిమా కోలీవుడ్ లో సూపర్ హిట్ కావటంతో ఇక్కడ మరిన్ని సినిమాలు చేసి తమిళ తంబీల మనసు గెలవాలని ఆరాటపడుతుంది. ప్రస్తుతం విక్రమ్ తో తమిళంలో ఓ సినిమా చేస్తోంది. ఇవి కాకుండా తమిళ ఆఫర్లు వస్తే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని మేనేజర్లకు చెప్పిందట. ఎలగూ మూడేళ్ళలో వాలంటరీ రిటైర్ అవుతుంది కాబట్టి.., ఈ లోపు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ అనే పేరుతో సెటిల్ అయిపోవాలని భావిస్తోంది. ఇక ఎవరి సినిమాలో ఉంటే వారి భజన చేస్తూ ప్రాక్టికల్ మైండ్ వ్యక్తుల్నే పరేషాన్ చేస్తే అమ్మడి ప్లానింగ్ చూస్తే ఎవరికైనా జెలసీ కలుగుతుంది.

మిల్కీ బ్యూటి తమన్నా కూడా తమిళ సినిమాల కోసం తహతహలాడుతోంది. గతంలో ఆర్యతో ‘బాస్ ఎంగిరా భాస్కరన్’ చేసిన డైరెక్టర్ రాజేష్ మరోసారి సేమ్ హీరోతో సినమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. వచ్చే వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. తెలుగులో పాపులర్ హీరోయిన్ అని తమన్నాకు పేరు వచ్చింది. అగ్ర హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో కూడా ఇదే ఫార్ములా వర్కవుట్ అయితే కెరీర్ కు ఇక తిరుగుండదని భావిస్తోంది. ఈ సినిమా తర్వాత మరో తమిళ ఆఫర్ వస్తే చేయటానికి డేట్లు కూడా అడ్జస్ట్ చేసేందుకు రెడి అవుతోందట. అంతలా కోరుకుంటోంది తమిళ స్ర్కీన్ ను. కాగా ఈ మూవీ ‘బాస్ ఎంగిరా భాస్కరన్’ కు సీక్వెల్ అనే ఊహాగానాలను డైరెక్టర్ తోసిపుచ్చాడు. ఇది డిఫరెంట్ కధతో వస్తున్న ఎంటర్ టైన్ మెంట్ సినిమా అని చెప్పాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  tamannaah  koliwood latest news  

Other Articles