Aamir khan again in trouble by commenting on homosexuality

aamir khan, aamir khan latest news, aamir khan homosexuality, homosexuality news, aamir khan latest news, aamir khan homosexuality comments, gay sex, lesbians, satyameva jayate show

aamir khan again in trouble by commenting on Homosexuality court summons send to him

‘‘స్వలింగ సంపర్కం’’ వివాదంలో బుక్కైన అమీర్!

Posted: 11/04/2014 11:51 AM IST
Aamir khan again in trouble by commenting on homosexuality

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన అమీర్.. ప్రతిఒక్క వ్యవహారంలో ముందుజాగ్రత్త తీసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన పనులను మొదలుపెట్టడం అతనికి అలవాటు! అది సినిమాలోనైనా కావొచ్చు.. వ్యక్తిగత విషయాలోనైనా కావొచ్చు.. ఇతరులపై కామెంట్ చేసే సమయంలోనైనా కావొచ్చు.. అన్నింటిలోనూ ఆచితూచి నడకలు వేస్తుంటాడు. అందుకే.. అభిమానులు ఆయన్ను ‘‘మిస్టర్ పర్ ఫెక్ట్’’ అనే పేరుతో పిలుచుకుంటారు. అటువంటి హీరో స్వలింగ సంపర్కులు తమ జీవిన విధానాన్ని మార్చుకోవాలని.. తమ విచ్చలవిడితనాన్ని ఇకపై చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమీర్ ఖండించాడు. ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన ఇతగాడు జనాభిప్రాయాలను సేకరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అందుకే.. ఇతను చేసిన ఈ పనికి ఈ వివాదంలో అనవసరంగా ఇరుక్కుపోయాడు.

నిజానికి గే/లెస్బియన్లు చాలాకాలం నుంచి తమ జీవన విధానాన్ని చట్టబద్ధత చేయాలంటూ పోరాడుతూనే వున్నారు. ఇతరుల్లాగా తమక్కూడా సమాజంలో స్వేచ్ఛ ప్రసాదించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలే సుప్రీంకోర్టు వారి గుండెలు బద్ధలయ్యేలా ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఇకపై స్వలింగసంపర్కుల విచ్చలవిడితనం చెల్లదని ఖరాఖండీగా వెల్లడించేసింది. అయితే అమీర్ ఖాన్ మాత్రం సుప్రీం ఆదేశానికి వ్యతిరేకంగా స్వలింగసంపర్కుల మద్దతుగా తెలపుతూ బయటికొచ్చాడు. ప్రస్తుతం అతడు బుల్లితెరపై నిర్వహిస్తున్న ‘‘సత్యమేవ జయతే’’ రియాలిటీ షోలో గేలకు మద్దతుగా ఒక ప్రశ్నను జనాలకు సంధించాడు. ఆ ప్రశ్నే ఇప్పుడు అమీర్ కు పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే అమీర్ సంధించిన ఈ ప్రశ్నకు ఓ న్యాయవాది కోర్టుకెక్కాడు. దీంతో ఈ విషయమై డిసెంబర్ 19లోపు దానికి సమాధానం ఇవ్వాల్సిందేనంటూ అమీర్ కు కోర్టు నోటిసులు జారీ చేసింది. అక్టోబర్ 19వ తేదీన లైవ్ టెలికాస్ట్ అయిన ‘‘సత్యమేవ జయతే’’ షోపై బాగా పరిశీలించిన అనంతరం కోర్టు ఈ విధంగా అమీర్ కు నోటీసులు పంపింది. గతకొన్నాళ్లముందు ‘‘పీకే’’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో నగ్నంగా కనిపించి కోర్టు వివాదాల్లో చిక్కుకున్న అమీర్.. మళ్లీ ఇప్పుడు స్వలింగసంపర్కంపై కామెంట్లు చేసి అడ్డంగా బుక్కయ్యాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  homosexuality  satyameva jayate  bollywood news  

Other Articles