Amitabh bachchan to act as father to bunny in trivikram srinivas movie

amitabh bachcha, allu arjun, tollywood stylish star bunny, amitabh bachchan latest news, allu arjun latest news, trivikram srinivas movie, adah sharma, samantha, nitya menon, amitabh bachchan father character, tollywood news

amitabh bachchan to act as father to bunny in trivikram srinivas movie

అల్లు అర్జున్ తండ్రి దొరికిపోయాడు..?

Posted: 11/04/2014 01:00 PM IST
Amitabh bachchan to act as father to bunny in trivikram srinivas movie

స్టైలిష్ స్టార్ గా పేరుగాంచిన అల్లుఅర్జున్ తండ్రి ఎట్టకేలకు దొరికేశాడని టాలీవుడ్ లో ప్రచారాలు కొనసాగుతున్నాయి. అదేంటి..? ఈయనకు ఆల్రెడీ తండ్రి వున్న విషయం తెలిసిందే కదా..! మరి దీనిని ఇంత విచిత్రంగా రాయడమెందుకు అని అనుకుంటున్నారా..? ఇక్కడ అల్లు రియల్ లైఫ్ తండ్రి గురించి కాదు.. రీల్ లైఫ్ తండ్రి గురించి! అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తాజాగా రూపొందుతున్న చిత్రంలో అల్లుకు తండ్రి దొరికిపోయాడని వార్తలు వస్తున్నాయి. అతనెవరో కాదు.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్! ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో అల్లుకు తండ్రిగా అమితాబ్ నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం!

అల్లు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లతో బన్నీ రొమాన్స్ చేయనున్నాడనే విషయం తెలిసిందే! అయితే ఈ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత వుందో.. అలాగే తండ్రి పాత్ర కూడా కీలకం! అందుకే ఈ క్యారెక్టర్ కోసం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చిత్రపరిశ్రమల్లో వున్న చాలామంది అగ్రహీరోలను పరిశీలిస్తున్నారు. ముందు ఈ ఫాదర్ క్యారెక్టర్ కోసం మోహన్ లాల్, మమ్ముట్టి పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలించారు. అయితే ఆ ఇద్దరి నుంచి ఇంకా రిప్లై రాకపోవడంతో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ పేరును త్రివిక్రమ్ పరిశీలిస్తున్నాడని సమాచారం. మరి అమితాబ్ ఈ క్యారెక్టర్ ను ఒప్పుకుంటారా..? లేదా..? అనే విషయం ఇంకా ఖరారు కాలేదు.

ఒకవేళ అమితాబ్ ఈ క్యారెక్టర్ చేసేందుకు ఓకే చెబితే.. ఈ సినిమాకు జాతీయస్థాయిలో విపరీతమైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాదు.. అల్లుకి బాలీవుడ్ లోనూ మార్కెట్ దారులు తెరుచుకుంటాయి. భారీ కలెక్షన్లను కాకపోయినా.. సినిమా రేంజ్ కు తగ్గట్టు అక్కడ వసూళ్లు వస్తాయి. దీంతో అల్లు నేరుగా కాకపోయిన బిగ్ బీ ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేయొచ్చన్నమాట! ఇప్పటికే తెలుగు, మలయాళంలో మంచి క్రేజ్ ను సంపాదించిన బన్నీ.. ఈ సినిమాతో అది మరింత పెరిగిపోయే అవకాశాలు చాలా వున్నాయి. మొత్తానికి బన్నీ దశ పూర్తిగా మారిపోతుంది. మరి బిగ్ బీ నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  amitabh bachcha  trivikram srinivas  samantha  nitya menon  

Other Articles