Allu sirish second movie will produced by his own

allu sirish movies, allu sirish next movie, allu sirish own production movie, allu sirish producer, allu sirish next movie, allu arjun next movie, allu arjun movies, allu family movies, mega family heros, tollywood latest news

allu Sirish second movie produced by his own : latest news that Sirish will produce his own film in which he will play the lead role as well. oung hero Allu Sirish is all set to produce a film very soon.

స్వయంకృషితో సినిమా తీస్తున్నాడు

Posted: 11/01/2014 11:15 AM IST
Allu sirish second movie will produced by his own

అల్లు ఫ్యామిలి నుంచి వచ్చిన హీరో శిరీష్ స్వయంకృషితో ఎదగాలని భావిస్తున్నాడు. తాను నటించిన తొలి సినిమా అంతగా ఆడలేదు. రెండవ సినిమా బాగుంది కానీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇప్పుడు మూడవ సినిమా ఈ రెండు లోటులను భర్తీ చేసేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు ఓ స్పెషాలిటి ఉంది. ముచ్చటగా చేస్తున్న మూడవ సినిమాను శిరీష్ సొంతంగా నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ లో తండ్రి పెద్ద నిర్మాతగా ఉన్నా.., తానే ప్రొడ్యూసర్ గా మారి తన సినిమాను తీసుకుంటున్నాడు.

ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టకుండా తన దగ్గర ఉన్నంతలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది. ఈ మూవీతో ఓ కొత్త డైరెక్టర్ ఇండస్ర్టికి పరిచయం అవుతున్నారట. ఓ సారి శిరీష్ ను కలిసి కధ చెప్పగా ఓకే అనేసిన శిరీష్ తానే దీన్ని నిర్మిస్తాను అని చెప్పాడట. ఇక హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ విషయాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి. అయితే ఈ మూవీ ద్వారా కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని అనుకుంటున్నారట.

ప్రస్తుతం ఈ మూవీ ప్రి ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. త్వరగా షెడ్యూల్ పూర్తి చేసేలా పక్కా ప్లాన్ చేస్తున్నాడు. తండ్రి దగ్గర బోలెడు డబ్బు, చేతిలో పెద్ద బ్యానర్ ఉన్నా., ఇవేవి వద్దు అనుకుని సొంతంగా తన సినిమా తీసుకోవాలనే నిర్ణయం హర్షించదగినది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్ శిరీష్.



కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu sirish  production  latest news  tollywood  

Other Articles