Pawan kalyan going kashi for gopala gopala

pawan kalyan in gopala gopala movie, pawan kalyan next movie, pawan kalyan gopala gopala movie latest updates, venkatesh in gopala gopala movie, pawan and venkatesh in gopala gopala, tollywood latest news, kashi tour, kashi tourist places

pawan kalyan going kashi for gopala gopala : power star pawan kalyan going to kashi for last schedule shooting of gopala gopala movie.

చివరి దశలో పవన్... త్వరలోనే కాశీకి ప్రయాణం

Posted: 11/01/2014 01:04 PM IST
Pawan kalyan going kashi for gopala gopala

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గోపాల గోపాల’ షూటింగ్ ముగింపుకు వచ్చేసింది. ఇప్పటివరకు 90శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో పదిశాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన పార్ట్ ను కాశీలో షూట్ చేస్తారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించి పవన్ వర్క్ పూర్తికాగానే.., మిగతా షూటింగ్ కోసం త్వరలోనే సినిమా యూనిట్ కాశీకి వెళ్తుందట. అక్కడ షెడ్యూల్ సీన్ల చిత్రీకరణ పూర్తయితే ఇక టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లే అని అంటున్నారు.

కొద్దికాలంగా రామోజి ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో భూకంపం రావటం, కొన్ని పాటలు సహా కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. షూటింగ్ లో పవన్, వెంకటేష్ తో పాటు శ్రియ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సీన్లు చాలాబాగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. కిశోర్ కుమార్ డాలి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పవన్ కృష్ణుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్-శరత్ మరార్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

పవన్ - వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న తొలి మల్టీస్టారర్ సినిమా కావటంతో ఇద్దరి ఫ్యాన్స్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. వెంకటేష్ కు మల్టీస్టారర్ మూవీ కొత్త కాకపోయినా పవన్ తో చేయటం ఇదే తొలిసారి. ఈ సినిమా అప్ డేట్స్ కు సంబంధించి మొదటి నుంచి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ చివరి వారంలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని సినిమా యూనిట్ వర్గాలు ప్రకటించాయి. మనిషి జీవితంలో చివరగా చేయాల్సిన యాత్ర కాశీ అని పెద్దలు చెప్తుంటారు. ఈ సినిమాకు సంబంధించి కూడా చివరి యాత్ర కాశీనే. విశ్వనాధుడిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందన్నట్లుగా... ఆయన సన్నిధిలో తెరకెక్కే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిద్దాం. అడ్వాన్స్ గా ‘గోపాల గోపాల’ టీంకు సేఫ్ అండ్ హ్యాపి జర్ని.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  kashi  gopala gopala  latest news  

Other Articles