Deepika padukone told that awards are matter for her

deepika padukone latest news, deepika padukone hot photos, deepika padukone hot photo shoot, deepika padukone happy new year movie, deepika padukone bikini photo shoot, deepika padukone movie updates, deepika padukone gossips, deepika padukone shah rukh khan, bollywood awards functions, deepika padukone interview, shahrukh khan, happy new year movie, shah rukh khan happy new year movie

deepika padukone told that awards are matter for her

‘‘నాకు అవే ముఖ్యం’’ - దీపికా పదుకొనె!

Posted: 10/27/2014 05:17 PM IST
Deepika padukone told that awards are matter for her

వరుస విజయాలతో బాలీవుడ్ అగ్రకథనాయికగా దూసుకుపోతున్న దీపిక పదుకొనె చివరకు తన మనసులోని మాటను చాలారోజుల తర్వాత బయటపెట్టేసింది. సహజంగానే ప్రతిఒక్కరికీ తమకంటూ కొన్ని ప్రత్యేక కోరికలుంటాయి. వాటిని తీర్చుకోవడం కోసమే రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. ఆ నేపథ్యంలోనే దీపికా కూడా తన మనసులోని మాటను వెల్లడిస్తూ.. అవార్డుల కోసమే తాను సినిమాల్లో పనిచేస్తున్నానని తెలిపింది.

‘‘అవార్డులే నాకు ముఖ్యం.. గత సంవత్సరంలో నేను నటించిన నాలుగు సినిమాలకు నాకు అవార్డులు లభించాయి. ఒకవేళ ఆ అవార్డులు నాకు రాకపోయివుంటే చాలా డిసప్పాయింట్ అయేదాన్ని! ఎవరికింత టాలెంట్ వుందని ఎంతసేపూ చర్చించుకోవడం ముఖ్యం కాదు.. అవార్డు వచ్చిందా..? లేదా..? అనేది ముఖ్యం. అలా ఎవరికైనా అవార్డు లభించినప్పుడు అందుకు వాళ్లు చాలా సంతోషపడుతారు. ఎందుకంటే.. అది మన కష్టానికి, ప్రశంసలకు గుర్తింపుగా వుంటుంది. ఒకవేళ నీకు అవార్డు దక్కితే.. ఆ విభాగంలో నువ్వు చాలా బాగా పనిచేస్తున్నట్టేగా.. రాకపోతే లేదు!’’ అంటూ అవార్డు మీద వున్న అవగాహనను పంచుకుంది దీపిక!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ సరసన హీరోయిన్ గా ‘‘ఓం శాంతి ఓం’’ చిత్రం ద్వారా పరిచయమైన దీపికా.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. మొదట్లో మంచి విజయాలను అందుకున్న ఈ అమ్మడు.. తర్వాత ఫ్లాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకదశలో అమ్మడి పనైపోయిందని భావిస్తున్న తరుణంలో ‘‘కాక్ టైల్’’ ఈమె కెరీర్ నే మార్చేసింది. దానిపై దీపిక స్పందిస్తూ.. ‘‘నేను నటించిన కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల నిరాశపడుకుండా ఆ సమయంలో నేను చేసిన తప్పులేంటో తెలుసుకున్నాను. తర్వాత తిరిగి ప్రస్థానాన్ని మొదలుపెట్టాను. అప్పుడు నేను నటించిన ‘‘కాక్ టైల్’’ మూవీయే నా కెరీర్ మలుపు తిప్పేసింది’’ అంటూ పేర్కొంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడు షారుఖ్ సరసన నటించిన ‘‘హ్యాపీ న్యూ ఇయర్’’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు బద్దలుకొడుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles