Kaththi movie war between tamil hero vijay and power star pawan kalyan in tollywood

pawan kalyan latest news, pawan kalyan news, pawan kalyan movies, pawan kalyan special updates, pawan kalyan janasena, pawan kalyan politics, pawan kalyan kaththi movie, hero vijay, tamil hero vijay, pawan kalyan hero vijay news, kaththi movie controversy, tamilnadu movies

kaththi movie war between tamil hero vijay and power star pawan kalyan in tollywood

ఇమేజ్ పెంచుకోవడం కోసం పవన్ తో విజయ్ ‘‘కత్తి’’ యుద్ధం!

Posted: 10/27/2014 05:37 PM IST
Kaththi movie war between tamil hero vijay and power star pawan kalyan in tollywood

ఫిల్మ్ ఇండస్ట్రీలో వున్న హీరోలందరూ తమ ఇమేజ్ ను పెంచుకోవాలంటే స్టార్ హీరోలతో తలపడక తప్పదు! స్టార్ హీరోలకంటే మెరుగైన సినిమాలను వరుసగా చేసుకుంటూపోతేనే చిన్నహీరోలకు సైతం మంచి పేరు లభిస్తుంది. కానీ ఇది అంత చిన్న విషయం కాదు! అదీకూడా ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తలపడటమంటే మాటలా! ఇప్పటికే టాలీవుడ్ లో వున్న అగ్రహీరోలందరూ పవన్ కల్యాణ్ ఇమేజ్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. ఆయనకంటే ఎంత మంచి సినిమాలు చేసినా కూడా.. వారి ఇమేజ్ కు తగ్గట్టే మంచి కలెక్షన్లతోపాటు విజయాలు సాధిస్తున్నారేగానీ.. పవన్ కు మించి ఎక్కువ కలెక్షన్లను సాధించలేకపోతున్నారు. అటువంటిది కోలీవుడ్ కు చెందిన స్టార్ హీరో విజయ్ తన ఇమేజ్ ను పెంచుకోవడానికి పవన్ లాంటి వపర్ స్టార్ తో గొడవ పడుతున్నాడని టాలీవుడ్ లో చర్చలు కొనసాగుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. విజయ్ హీరోగా మురుగదాస్ రూపొందించిన ‘‘కత్తి’’ సినిమా తమిళంలో భారీ విజయం సాధించడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను తీసుకున్న ఠాగూర్ మధు దీనిని పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయాలని ట్రై చేస్తున్నారని సమాచారం! ఈ క్రమంలోనే ఈ చిత్రం చూసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పవన్ చెప్పడంతో.. ఆయనకోసం హైదరాబాద్ లో ప్రత్యేకమైన స్ర్కీనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మరి స్ర్కీనింగ్ అనంతరం పవన్ ఈ సినిమా చేయడానికి పవన్ ఒప్పుకుంటాడా..? లేదా..? అన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక మంచి మెసేజ్ తో కూడిన కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ పవన్ తో రీమేక్ చేయిస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని.. అలాగే కలెక్షన్లను బాగానే కురిపిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలావుండగా.. తమిళ హీరో విజయ్ కి టాలీవుడ్ లో కొంత మార్కెట్ వున్న సంగతి తెలిసిందే! అయితే దానిని మరింత విస్తృతం చేసుకోవాలని ఆ హీరో భావిస్తున్నాడని సమాచారం! అందువల్లే ఆ హీరో తన ‘‘కత్తి’’ సినిమాను మరొకరితో రీమేక్ చేయడానికి ఒఫ్పుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. ‘‘కత్తి’’ సినిమాతో టాలీవుడ్ లో కూడా తన ఇమేజ్ పెంచుకుని.. ఇక్కడ కూడా స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకునే ఆలోచనలో విజయ్ వున్నాడని చర్చలు కొనసాగుతున్నాయి. ఇలా ఈ విజయ్ తన ఇమేజ్ ను పెంచుకోవడం కోసమే హీరో విజయ్, పవన్ తో ‘‘కత్తి’’ యుద్ధం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఈ సినిమా నచ్చి పవన్ తెలుగులో రీమేక్ చేయడానికి ఒప్పుకుంటే.. అందుకు విజయ్ ఎలా స్పందిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  hero vijay  tamil kaththi movie  tollywood news  telugu news  

Other Articles