Ram gopal varma on sridevi movie

ram gopal varma, ram gopal varma movies, ram gopal varma wki, ram gopal varma latest movies, ram gopal varma upcoming movies, ram gopal varma comments, ram gopal varma facebook comments, ram gopal varma critics, ram gopal varma controversy, ram gopal varma wife, ram gopal varma sridevi, ram gopal varma on sridevi, ram gopal varma sridevi movie, sridevi movie latest photos, sridevi latest posters, latest news, tollywood news, latest updates, telugu latest updates

director ram gopal varma again clarified about his latest movie sridevi says there is no matter of story about teacher and student : sridevi movie is not about a teacher and student story its just of a teenage boy attarction towards her neighbour aunty says ram gopal varma

అమె సరస్వతి కాదంటే వినరే.... శ్రీదేవిపై వర్మ ఏమన్నాడంటే

Posted: 10/10/2014 04:26 PM IST
Ram gopal varma on sridevi movie

రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఓ కాంట్రవర్సీ.., లేదా ఓ సంచలనం అనేది తప్పకుండా ఉంటుంది. రచ్చ లేకపోతే రాము ఎలా అవుతాడు అనుకునేలా చేస్తున్నాడు ఈ మద్య. తాజాగా తెరకెక్కిస్తున్న ‘శ్రీదేవి’ సినిమా కూడా ఇలానే వివాదాలమయం అవుతుంది. సినిమా విడుదల కాకముందే వద్దు బాబోయ్ అంటూ మహిళా సంఘాలు, బాలల హక్కుల కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి సినిమాల వల్ల యువత చెడిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపై అయినా నిర్మొహమాటంగా కామెంట్లు చేసే రామ్ గోపాల్ వర్మ.., వీరిపై కూడ తన అసహనం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు.

గత వారం రోజులుగా వస్తున్న విమర్శలపై వర్మ ఫేస్ బుక్ లో శుక్రవారం రోజు స్పందించాడు. వర్మ ఫేస్ బుక్ కామెంట్లో ఏమన్నాడంటే ‘‘శ్రీదేవి’ సినిమా టీచర్ - స్టూడెంట్ మద్య కధతో తీస్తున్న సినిమా కాదు అని మరోసారి వివరణ ఇస్తున్నా. సినిమా కధ ఏమిటి అనేది చెప్పడానికి సింపుల్ గా ఉంటుందని టీనేజిలో ఉన్నపుడు నేను సరస్వతి అనే టీచర్ ను చూసి ఎలా ఫీల్ అయ్యేవాడినో చెప్పానంతే. అంతమాత్రానికే సినిమా పోస్టర్ లో కన్పించే మహిళను టీచర్ గా.., అబ్బాయిని స్టూడెంట్ గా ఊహించుకుంటే ఏమనాలి. మీరేదో ఊహించుకుని ఆందోళనలు చేపడితే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. కధ టీచర్ కు సంబంధించినది కాదు అని చెప్పాక కూడా అర్దం చేసుకోలేకపోవటాన్ని ఏ నిరక్షరాస్యత అంటారో మరి.

ముందు నన్ను సినిమా తీయనివ్వండి.., కధలో, సన్నివేశాల్లో నిజంగా అభ్యంతరాలు ఉంటే వాటిని కత్తిరించటానికి సెన్సార్ బోర్డు ఉంది. సినిమా తీయకముందే సెన్సార్ బోర్డు చేసే పనులు మీరే చేసేస్తే ఇంక అది ఎందుకు. కధ సులువుగా అందరికి అర్ధం అవుతుంది అనే ఉద్దేశ్యంతో.. సరస్వతి టీచర్ ను నేను అలా చూసేవాడిని.. అని చెప్తే అదే కధ అని ఊహించేసుకుంటున్నారు. అది తప్పు మరొకసారి చెప్తున్నా కధకు టీచర్ కు సంబంధం లేదు. కావాలంటే సినిమా కధ ఏమిటో మరోసారి మీకోసం అందిస్తున్నా ఇప్పటికైనా తెలుసుకోండి.

‘శ్రీదేవి’ కధ

కధలో ఉండే యుక్తవయస్సులోని అబ్బాయికి ఇంటి పక్కనే ఉండే ఓ మహిళపై ఆకర్షణ ఉంటుంది. ఆ మహిళ సాధారణ గృహిణి, ఆమె భర్త బిజినెస్ మెన్. ఇంటి పక్కన ఉండే ఆ ఆంటిపై అబ్బాయికి వచ్చే ఆలోచనలు, ఆమెను చూసే పద్దతులు ఇవి మాత్రమే సినిమాలో చూపించటం జరుగుతుంది. అంతేకాకుండా యుక్త వయస్సులో అబ్బాయిలను ప్రభావితం చేసే విషయాలు, స్నేహితుల మాటలు, టీవీ ప్రకటనలు, మారిన జీవిన పరిణామాలు, సమాజంలోని పరిస్థితులు ఏమిటి అనే కోణంతో సినిమా కధ ఉంటుంది.

ముందుగా సావిత్రి అని ఆ తర్వాత పలు కారణాలతో సినిమా పేరును ‘శ్రీదేవి’ అని వర్మ మార్చేశాడు. అయినా సరే వర్మ సినిమాపై మాత్రం వివాదాలు ఆగటం లేదు. దీంతో ఫేస్ బుక్ లోని తన పేజిలో మరోసారి వివరణ ఇచ్చేశాడు. మీ ఇష్టం వచ్చినట్లు అనుకుంటే నాకు సంబంధం లేదు అని ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు ఈ సరస్వతి టీచర్ గురించి కొద్దిరోజుల క్రితం తన భార్యకు చెప్తే.., ఆమె అర్ధం చేసుకుందట. యుక్త వయస్సులో తనకు కలిగిన భావాలు, అప్పుడు ఉండే ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తిగా ఏమి అనలేదు అని చెప్పాడు. అన్ని తెలిసిన వ్యక్తులే సైలెంట్ గా ఉన్నపుడు... ఏమి తెలియని వారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్ధం కావటం లేదు అంటూ స్పందించాడు. ఇలాంటి వారి వల్లే తనకు సమస్యలు వస్తున్నాయి అని వర్మ చివరగా వాపోయాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  sridevi  latest updates  movie news  

Other Articles