Sana makbul in dikkulu chudaku ramayya

sana makbul, sana makbul wiki, sana makbul movies, sana makbul latest, sana makbul hot photos, sana makbul latest hot photos, sana makbul affairs, naga shourya, ajay wiki, ajay photos, dikkulu chudaku ramayya, dikkulu chudaku ramayya wiki, dikkulu chudaku ramayya movie, dikkulu chudaku ramayya latest updates, dikkulu chudaku ramayya gossips, dikkulu chudaku ramayya movie download

sana makbul acted as heroine in dikkulu chudaku ramayya movie : heroine sana makbul entertained in her first movie with naga shourya and ajay

ఇద్దరి మద్య బాగా నలిగిపోయింది

Posted: 10/10/2014 01:53 PM IST
Sana makbul in dikkulu chudaku ramayya

తొలి సినిమా అంటే ఎంట్రీ బాగుండేలా హీరోయన్లంతా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లుగా తొలి సినిమాలో కేకపెట్టించి.. కాక పుట్టిస్తే కెరీర్ లో కిక్కు ఉంటుందని అంతా నమ్ముతారు. అలాగే సనా కూడా ‘దిక్కులు చూడకు రామయ్య’ను నమ్ముకుంది. అందాలతో మిస్ ఇండియా ఫైనలిస్టుగా వెళ్ళిన ఈ అమ్మడు సినిమాలో బాగానే అందాలను పరిచయం చేసింది. ఈ సినిమాపై తన కెరీర్ ఆధార పడటంతో శ్రమనంతా దారపోసినట్లు చెప్తోంది. అందం.., అభినయం కలిపి రామయ్య కోసం నటించినట్లు వివరించింది.

ఇక సినిమా లో తన క్యారెక్టర్ గురించి  ముంబై భామ ఏమందంటే.., ఓ ఎరోబిక్ టీచర్.. అందమైన టీచర్ అంటే, అబ్బాయిలకు ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒంపలు తిరిగే అందాలను చూసేందుకే ట్రైనింగ్ పేరుతో జాయిన్ అయినవారు చాలామంది ఉన్నారు. ఇక ట్రైనింగ్ పూర్తి చేసి బయటకు రాగానే మన రామయ్య వెంట పడతాడు. ఓ వైపు తండ్రి తహతహలాడుతుంటే.. మరోవైపు కొడుకు రొమాన్స్ చేస్తుంటాడు. ఇలా ఇద్దరి మద్య సినిమాలో చాలా నలిగిపోయిందట. మామను  చూస్తే కోపం అదే సమయంలో అబ్బాయిని చూస్తే మాత్రం చెప్పలేని ప్రేమ పుట్టుకొచ్చేదని సిగ్గుపడుతోంది.

కధ డిఫరెంట్ గా ఉండటంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు చెప్తోంది. ఇప్పుడున్న తరుణంలో అన్నీ లవ్ సినిమాలు వస్తుంటే.., ఈ కధ మాత్రం కాస్త వెరైటిగా ఉందట. సినిమా షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేసిందట. రామయ్య సినిమా పుణ్యమా అని కొన్ని తెలుగు పదాలు కూడా చిలకలా పలుకుతుందీ మిస్ బ్యూటి. ప్రస్తుతం ఈ సినిమాకు వచ్చిన స్పందనను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న సనా త్వరలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆశిస్తోంది. చూడాలి మరి మక్బూల్ రెండవ సినిమా ఏదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dikkulu chudaku ramayya  sana makbul  latest updates  movie news  

Other Articles